హీరో సిద్దార్థ్ క్షమాపణలు చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఎందుకంటే?

తెలుగు ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాయ్స్,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొచెం ఇష్టం.. కొంచెం కష్టం ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సిద్దార్థ్. ప్రస్తుతం సిద్దార్థ్ ‘చిత్తా’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా గురువారం బెంగుళూరులో మల్లేశ్వరిలోని ఎస్ఆర్‌వీ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో సిద్దార్థ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేధికగా స్పందించారు. వివరాల్లోకి వెళితే..

హీరో సిద్దార్థ్ కి బెంగుళూరులో విలేకరుల సమావేశంలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘చిత్తా’ తెలుగులో చిన్నా మూవీగా రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా బెంగుళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు కార్యక్రమంలోకి దూసుకు వచ్చి ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారు. సిద్దార్థ్ తన మూవీ ప్రమోషన్ లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా.. ప్రస్తుతం కావేరీ నది జలాల వివాదం నడుస్తున్న సమయంలో ఒక తమిళ మూవీ ప్రమోషన్ చేయడం సరికాదని కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సిద్దార్ధ్ వారికి చేతులు జోడించి ప్రెస్ మీట్ అడ్డుకోవద్దని చెప్పినా వినిపించుకోలేదు. వెంటనే ప్రమోషన్ ఆపి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిద్దార్ధ్ వారికి దండం పెట్టి ప్రెస్ మీట్ మధ్యలోనే నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ ఘటనపై స్పందించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా హీరో సిద్దార్థ్ కి క్షమాపణలు చెప్పారు. ‘కావేరీ జలాల సమస్య దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నేతలను ప్రశ్నించకుండా.. సామాన్యులను, సినీ కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. ఒక కన్నడిగుడిగా.. వారి తరుపు నుంచి సిద్దార్థ క్షమించండి’ అంటూ రాసుకొచ్చారు. గత కొంత కాలంగా నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments