iDreamPost
android-app
ios-app

పసిపాపతో తిరుమలకు ప్రభుదేవ దంపతులు!

  • Published Jul 22, 2023 | 8:14 AM Updated Updated Jul 22, 2023 | 8:14 AM
  • Published Jul 22, 2023 | 8:14 AMUpdated Jul 22, 2023 | 8:14 AM
పసిపాపతో తిరుమలకు ప్రభుదేవ దంపతులు!

ఇండియన్‌ మైఖల్‌ జాక్సన్‌ ప్రభుదేవ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన హీరోగా.. విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గా.. దర్శకుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. సినిమా ఫీల్డులో సూపర్‌ సక్సెస్‌ సాధించిన ప్రభుదేవ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. పెళ్లిళ్లు, లవ్‌ ఎఫైర్లతో సతమతం అయ్యారు.

ప్రభుదేవ 1995లో రామ్‌లతను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే, నయనతారతో లవ్‌ ఎఫైర్‌ కారణంగా వీరి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడింది. భార్య లత.. ప్రభుదేవ-నయనతార ఎఫైర్‌పై కోర్టుకు ఎక్కింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల ప్రభు-నయన్‌ల పెళ్లి జరగలేదు. ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. 2011లో లత.. ప్రభుదేవ విడాకులు తీసుకుని విడిపోయారు.

చాలా కాలం తర్వాత ప్రభుదేవ.. హిమనిసింగ్‌ను రెండో  పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప పుట్టింది. నిన్న పాపతో కలిసి ప్రభుదేవ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హిమని చేతిలో చంటి బిడ్డతో క్యూలైన్‌లో నడుస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ప్రభుదేవను చూడగానే ఆయన ఫ్యాన్స్‌ ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరి, భార్య హిమనితో ప్రభుదేవ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş