iDreamPost
android-app
ios-app

Real Lion in Mambo Movie: నిజమైన సింహంతో పాన్ ఇండియా మూవీ! డైరెక్టర్ ధైర్యానికి హ్యాట్సాఫ్..

  • Published Jul 26, 2024 | 11:33 AM Updated Updated Jul 26, 2024 | 11:33 AM

Real Lion in Mambo Movie: ప్రకృతి, అడవులు, జంతువుల నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించే ఓ డైరెక్టర్.. ఇప్పుడు ఏకంగా నిజమైన సింహాన్ని పెట్టి, ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

Real Lion in Mambo Movie: ప్రకృతి, అడవులు, జంతువుల నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించే ఓ డైరెక్టర్.. ఇప్పుడు ఏకంగా నిజమైన సింహాన్ని పెట్టి, ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 26, 2024 | 11:33 AMUpdated Jul 26, 2024 | 11:33 AM
Real Lion in Mambo Movie: నిజమైన సింహంతో పాన్ ఇండియా మూవీ! డైరెక్టర్ ధైర్యానికి హ్యాట్సాఫ్..

కమర్షియల్ సినిమాలు తీసి, ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలనుకునే ఈ కాలంలో.. ప్రకృతి, జంతువులు, అడవులు అంటూ సినిమాలు తీస్తూ.. తన విలక్షణ శైలిని చాటుకుంటున్నాడు ఓ డైరెక్టర్. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రానా తో ‘అరణ్య’ మూవీ తీసి ప్రశంసలు దక్కించుకున్న ప్రభు సాల్మాన్. జంతువులు, అడవుల నేపథ్యంలో సినిమాలు తీసి నేచర్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా నిజమైన సింహాన్ని పెట్టి ఓ మూవీని తెరెక్కిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో. మరి ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభు సాల్మాన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అతడు తీసిన సినిమాలు మాత్రం అందరికి గుర్తే. మైనా తెలుగులో ప్రేమఖైదీగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏనుగు క్యారెక్టర్ తో ‘గజరాజు’ అనే పుల్ లెంత్ మూవీ చేశాడు. రానా నటించిన అరణ్య మూవీలో కూడా ఏనుగులు, నేచర్ నే మెయిన్ పాయింట్ గా ఎన్నుకున్నాడు. అరణ్య కమర్షియల్ గా ఆడలేదు కానీ.. నేచర్ పై అతడికున్న ప్రేమ మాత్రం ప్రేక్షకులకు అర్ధమైంది. ఇక ఇప్పుడు ఏకంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘మాంబో’లో ఏకంగా నిజమైన సింహాన్ని పెట్టి సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

‘మాంబో’ మూవీని ఒక మనిషికి, క్రూర జంతువుకు మధ్య ఏర్పడే స్నేహం ఆధారంగా తీస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చినట్లు సమాచారం. ఇండియాలో జంతువులను పెట్టి మూవీస్ తియడం నిషేదం కాబట్టి.. విదేశాల్లో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేశారట. ఇక ఈ చిత్రం ద్వారా వనిత విజయ్ కుమార్ కొడుకు విజయ్ శ్రీహరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాగా.. ఆసియాలోనే ఇలా రియల్ లయన్ తో సినిమా తీసిన మెుట్టమెుదటి చిత్రంగా మాంబో నిలవబోతోంది. మరి నిజమైన సింహంతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో మూవీని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ప్రభు సాల్మాన్ ధైర్యానికి నెటిజన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş