iDreamPost
android-app
ios-app

రీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్‌ హిట్‌ లవ్‌ స్టోరీ. భారీ రేటుని కొనుగోలు!

  • Published Mar 09, 2024 | 2:09 PM Updated Updated Mar 09, 2024 | 2:19 PM

Premikudu Re Release Update: గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు ధియేటర్లోకి మళ్లీ రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

Premikudu Re Release Update: గత కొంత కాలంగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు ధియేటర్లోకి మళ్లీ రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

  • Published Mar 09, 2024 | 2:09 PMUpdated Mar 09, 2024 | 2:19 PM
రీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్‌ హిట్‌ లవ్‌ స్టోరీ. భారీ రేటుని కొనుగోలు!

ఇటీవల టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట మాస్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ చేయగా.. ఇప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాలు రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇటీవల ఖుషి, ఆరెంజ్, ఓయ్ మరికొన్ని ప్రేమ కథా చిత్రాలు రి-రీలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో ఆరెంజ్ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశ పరిచింది.. కానీ రీ రిలీజ్ చేసిన తర్వాత ఊహించని విధంగా కలెక్షన్లు సాధించింది. ఈ సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు లవ్ స్టోరీ మూవీస్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు మూవీ మేకర్స్. ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇదే బాటలో ఒకప్పుడు క్లాసిక్ హిట్ గా నిలిచిన మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివరాల్లోకి వెళితే..

భారతీయ చలన చిత్ర రంగంలో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కమర్షియల్ సినిమాలేకాదు.. ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా తెరకెక్కించారు. 1994 లో ఆయన దర్శకత్వం వహంచిన ‘ప్రేమికుడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడు కోట్లతో ఈ సినిమా తీస్తే.. 15 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రభుదేవ నటుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రభుదేవ సరసన నగ్మ నటించింది. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లే యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది.

దాదాపు 30 ఏళ్ల తర్వా ఈ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పోటీ పడుతున్నారు. సీఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మురళీధర్ రెడ్డి, రమణ ఈ సినిమా భారీ రేటు చెల్లించి రీ రిలీజ్ రైట్స్ దక్కించుకున్నారు. త్వరలో ఈ మూవీ రీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఎంతో కాంపిటీషన్ ని చూపించిన ప్రేమికుడు మరి థియేటర్లో ఎలా మళ్లీ ఎలా వసూళ్లు చేస్తాడో చూడాలి. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందించగా.. అందులో పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ వడివేలు కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. విలన్ గా రఘువరన్ అద్బుతంగా నటించారు. ప్రభుదేవ అభిమానులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet