iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ‘ది రాజా సాబ్’ సెట్స్ లోకి ప్రభాస్!

  • Published Mar 12, 2024 | 9:38 AM Updated Updated Mar 12, 2024 | 9:43 AM

డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి ప్రభాస్ ఏ రోజు నుంచి ఈ మూవీ సెట్స్ లోకి వస్తాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి ప్రభాస్ ఏ రోజు నుంచి ఈ మూవీ సెట్స్ లోకి వస్తాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Mar 12, 2024 | 9:38 AMUpdated Mar 12, 2024 | 9:43 AM
డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ‘ది రాజా సాబ్’ సెట్స్ లోకి ప్రభాస్!

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రాలలో ఒకటి ” ది రాజా సాబ్”. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తుండగా, టి.జి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బడ్జెట్ పరంగా ఈ సినిమాకు ఎలాంటి లోటుపాట్లు లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ లకి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

మారుతీ అనే పేరు వింటే ఎంటర్టైనర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రేమకథాచిత్రమ్, భలే భలే మగాడివొయ్, మహనుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ లు అందించిన ఈ దర్శకుడు మొట్టమొదటిసారి ప్రభాస్ వంటి బిగ్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. ఈ వెరైటీ కాంబినేషన్ నుండి ప్రేక్షకులు ఒక గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమానే ఆశిస్తారు. మొదట్లో ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ బాగా వినిపించినా, చివరికి ది రాజా సాబ్ అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హారర్ టచ్ ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన మార్కు ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ప్రభాస్ ఇమేజ్ కు సరిపోయే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని దర్శకుడు మారుతీ తెలిపారు. కాగా ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్… తొందరలోనే ది రాజా సాబ్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ పాల్గొనే సన్నివేశాలు కాకుండా మిగతా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది ది రాజా సాబ్ యూనిట్. తాజా సమాచారం ప్రకారం, ఇటీవలే కల్కి 2898 AD సినిమాలోని ఒక పాట షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్, మార్చి 13 నుండి రాజా సాబ్ సెట్స్‌ పైకి వెళ్లనున్నారు. ఇక నుంచి ఈ సినిమాకి కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదికూడా చదవండి: కమల్, రజినీ కాదు.. ఫస్ట్ రూ. కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో! మీరు ఊహించలేరు..

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis