iDreamPost

కమల్, రజినీ కాదు.. ఫస్ట్ రూ. కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో! మీరు ఊహించలేరు..

కమల్ హాసన్, రజినీకాంత్ కంటే ముందుగానే రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా? అతనెవరో మీరు అస్సలు ఊహించలేరు. ఆ వివరాల్లోకి వెళితే..

కమల్ హాసన్, రజినీకాంత్ కంటే ముందుగానే రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా? అతనెవరో మీరు అస్సలు ఊహించలేరు. ఆ వివరాల్లోకి వెళితే..

కమల్, రజినీ కాదు.. ఫస్ట్ రూ. కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో! మీరు ఊహించలేరు..

సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటులుగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇక రజినీకైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరితో పాటుగా కోలీవుడ్ లో విజయ్, అజిత్ లతో పాటుగా మరికొంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. అయితే వీరిందరి కంటే ముందుగా ఒక్క మూవీకి రూ. కోటి పారితోషికం తీసుకున్న హీరో ఎవరో మీకు తెలుసా? ఈ అగ్రనటులను కాదని కోలీవుడ్ లో 1996లోనే ఒక్క సినిమాకి ఏకంగా రూ. కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆ నటుడు. మరి ఆ స్టార్ ఎవరో తెలుసుకుందాం పదండి.

రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కోలీవుడ్ లో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇక వీరు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఇదంతా ఇప్పుడు. కానీ.. సుమారు 20 సంవత్సరాల క్రితమే వీరి కంటే ముందుగానే ఒక్క చిత్రానికి రూ. కోటి తీసుకున్న హీరో గురించి మీకు తెలుసా? తమిళ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్ ఒక్క మూవీకి కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా ‘మోహిదీన్ అబ్దుల్ ఖాదర్’ చరిత్రకెక్కాడు. వెండితెరపై ‘రాజ్ కిరణ్’ గా అందరికి సుపరిచితుడు. రూ. 5 జీతంతో చెన్నైలో రోజూవారి కూలీగా పనిచేసిన అతడు.. స్టార్లను తలదన్నేలా పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

రాజ్ కిరణ్ తొలుత సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని స్థాపించి, క్రమంగా నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో రాజ్ కిరణ్ హీరోగా నటించిన సినిమాలు భారీ హిట్లు కావడంతో.. నిర్మాతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో తమిళ్ లో ‘మాణిక్కం’ అనే మూవీ 1996లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి కెవి పాండియన్ దర్శకత్వం వహించగా.. రాజ్ కిరణ్ కోటికి పైగా పారితోషికం అందుకున్నాడు. దీంతో కోలీవుడ్ లో ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇతడి తర్వాతే కమల్, రజినీ, అజిత్, విజయ్ లు ఆ స్థాయికి చేరుకున్నారు.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి రాజ్ కిరణ్ కంటే ముందుగానే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1992లో వచ్చిన ‘ఆపద్భాంధవుడు’ మూవీకి అప్పట్లోనే రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చరిత్రకెక్కాడు మెగాస్టార్. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫీచర్ పేజ్ లో చిరు గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ పేరుతో ఈ వ్యాసం ప్రచూరితం అయ్యింది. మరి రజినీ, కమల్ కంటే ముందుగానే కోటి పారితోషికం అందుకున్న సీనియర్ నటుడు రాజ్ కిరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నటి జయలలిత షాకింగ్ కామెంట్స్.. సీనియర్ నటుడు తలుపులు కొట్టి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి