iDreamPost
android-app
ios-app

Prabhas: ‘ఆదిపురుష్’ రిజల్ట్ ను ప్రభాస్ ముందే పసిగట్టాడా? వైరల్ అవుతున్న వీడియో..

  • Author Soma Sekhar Published - 11:47 AM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 11:47 AM, Wed - 21 June 23
Prabhas: ‘ఆదిపురుష్’ రిజల్ట్ ను ప్రభాస్ ముందే పసిగట్టాడా? వైరల్ అవుతున్న వీడియో..

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం హిట్ అవుతుంది అనుకున్న సినిమా అట్టర్ ఫ్లాప్ కావొచ్చు. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు. కానీ షూటింగ్ జరిగే సమయంలోనే హీరోలకు ఆ మూవీ హిట్ అవుతుందో.. లేక బోల్తా కొడుతుందో ముందే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని చాలా మంది హీరోలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ను ముందుగానే పసిగట్టినట్లు ఉన్నారు. అందుకు సంబంధించి ‘రాధేశ్యామ్’మూవీ రిలీజ్ టైమ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. సీతగా కృతి సనన్ నటించగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల అయిన ఈ చిత్రం మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాలుగో రోజు నుంచి డ్రాపౌట్ అవుతోంది. కలెక్షన్లు భారీగా పడిపోతున్నాయి. కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా బాగుంది అంటే.. మరికొంత మంది సినిమా బాలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ను ముందే పసిగట్టాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దానికి బలమైన కారణం ‘రాధేశ్యామ్’ మూవీ టైమ్ లో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో డార్లింగ్ ఈ విధంగా మాట్లాడారు.”ఆదిపురుష్ సినిమా షూటింగ్ నాలుగు రోజులు జరిగిన తర్వాత నాకు ఔట్ ఫుట్ మీద డౌట్ వచ్చింది. దాంతో నాకు ఈ సినిమా మీద అనుమానం వచ్చింది. నేను ఈ సినిమా చేయ్యెుచ్చా? గతంలో నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మిగతా మూవీల్లో తప్పు జరిగినా పర్లేదు. కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు అని డైరెక్టర్ ఓం రౌత్ ను అడిగాను. కానీ అతను మీరు అలాంటి భయాలు పెట్టుకోవద్దు మూవీ భాగా వస్తుంది, నేనున్నాను అంటూ భరోసా” ఇచ్చాడని ప్రభాస్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ రిజల్ట్ తర్వాత ఈ వీడియో వైరల్ గా మారింది.

దాంతో ఈ వీడియో చూసిన అభిమానులు డార్లింగ్ ముందే ఆదిపురుష్ రిజల్ట్ పసిగట్టాడు. కానీ ఓం రౌత్ ప్రభాస్ మాటవినలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆదిపురుష్ విషయంలో వచ్చిన విమర్శలు మరే ఇతర సినిమాపై రాలేదనే చెప్పాలి. ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి మూడు రోజుల్లో రూ. 340 కోట్లు వసూల్ చేసిన ఆదిపురుష్.. నాలుగో రోజు దారుణంగా కేవలం రూ. 35 కోట్లనే రాబట్టగలిగింది. ఈ లెక్కన చూస్తే.. సినిమా లాభాల్లోకి రావడం కష్టమే అనిపిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet