iDreamPost

Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్‌.. ఇక నుంచి అలానే పిలవాలంటా!

  • Published Jun 27, 2024 | 10:22 AMUpdated Jun 27, 2024 | 10:25 AM

Prabhas New Name in Kalki Movie: డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన కల్కి చిత్రం నేడు విడుదలయ్యింది. ఈ క్రమంలో సినిమా గురించే కాక.. ప్రభాస్‌ పేరుపై కూడా ఆసక్తికర ట్విస్ట్‌ ఇచ్చారు. డార్లింగ్‌ పేరు మార్చుకున్నాడు. కొత్త పేరేంటి అంటే..

Prabhas New Name in Kalki Movie: డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన కల్కి చిత్రం నేడు విడుదలయ్యింది. ఈ క్రమంలో సినిమా గురించే కాక.. ప్రభాస్‌ పేరుపై కూడా ఆసక్తికర ట్విస్ట్‌ ఇచ్చారు. డార్లింగ్‌ పేరు మార్చుకున్నాడు. కొత్త పేరేంటి అంటే..

  • Published Jun 27, 2024 | 10:22 AMUpdated Jun 27, 2024 | 10:25 AM
Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్‌.. ఇక నుంచి అలానే పిలవాలంటా!

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ. ఈ ఏడాది ప్రారంభం నుంచే కల్కి సినిమా మీద అంచనాలు మొదలయ్యాయి. ఇక సినిమా విడుదలకు ముందు నుంచి కల్కి నుంచి రిలీజ్‌ చేసిన ఒక్కో అప్డేట్‌.. మూవీ మీద అంచనాలను పెంచుతూ పోయాయి. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకోన్‌, శోభన, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటించారు. నేడు అనగా జూన్‌ 27, గురువారం ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీమహా విష్ణువు పది అవతారాల్లో చివరిదైన కల్కి అవతారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పురాణాలను, భవిష్యత్తును కలుపుతూ.. యుగాంతం కాన్సెప్ట్‌ మీద భారీ తారాగణంతో.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన కల్కి చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

గురువారం తెల్లవారుజాము నుంచే కల్కి.. బెనిఫిట్‌ షోలు పడ్డాయి. ఇక సినిమా చూసిన అభిమానులు.. గూస్‌బంప్స్‌ పక్కా.. హాలీవుడ్‌ని మించి కల్కిని తెరకెక్కించారు.. తెర మీద విజువల్‌ వండర్‌ను చూస్తున్నట్లుగా ఫీలవుతారు అని కామెంట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక సినిమాలో ఊహించని సర్ప్రైజ్‌లు  చాలా ఉన్నాయిని.. అనేక మంది ప్రముఖ దర్శకులు, హీరోలు కల్కిలో గెస్ట్‌ రోల్‌లో కనిపించారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా మాత్రం.. బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు అంటున్నారు. ఈ క్రమంలో కల్కి టైటిల్స్‌ పడే సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్‌ పేరు మారిపోయింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

సాధారణంగా మన హీరోల పేర్లకు ముందు మెగా, సూపర్‌, ఐకాన్‌ స్టార్‌ వంటి ట్యాగ్‌లుంటాయి. అభిమానులు వాటిని యాడ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో డార్లింగ్‌ ప్రభాస్‌ను అభిమానులు ముద్దుగా రెబల్‌ స్టార్‌ అని పిలిచుకుంటారు. కానీ కల్కి సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో రెబల్‌ స్టార్‌ అని పడలేదు. కారణం ఏంటి అంటే ప్రభాస్‌ పేరు మార్చుకున్నాడు. ఇంతకు డార్లింగ్‌ పేరు ముందు ఏం వచ్చి చేరిదంటే.. శ్రీ. అవును ఇక మీదట ప్రభాస్‌ను శ్రీ ప్రభాస్‌ అని పిలవాలి. డార్లింగ్‌, రెబల్‌ స్టార్‌ కాస్త.. శ్రీ ప్రభాస్‌గా మారాడు.

ఇక కొన్ని రోజుల క్రితమే మరో హీరో ఇలానే పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబుకు కూడా ‘నైట్రో స్టార్’ అనే టాగ్ ఉంది. అయితే తాజాగా వచ్చిన హరోం హర సినిమా సందర్భంగా ఆ ట్యాగ్‌ మార్చుకున్నారు. టైటిల్స్‌ పడే సమయంలో సుధీర్‌ బాబు పేరుకు ముందు నవదళపతి అనే కొత్త ట్యాగ్‌ వచ్చి చేరింది. ఇక ప్రభాస్‌ పేరు ముందు శ్రీ అని చేర్చడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. మాస్‌ ప్రేక్షకులు ఈ కొత్త ట్యాగ్‌ను ఆమోదిస్తారో లేదో చూడాలి.

ఇక కల్కి సినిమాలో దక్షిణాది తారలు మాత్రమే కాక.. బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా కనిపించారు. ఇక కల్కి సినిమాలోని హైలెట్‌ సీన్స్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. సినిమా మీద మరింత హైప్‌ పెంచుతున్నారు. మొత్తానికి ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్టు పడింది అంటున్నారు. త్వరలోనే కల్కి పార్ట్‌ 2 పనులు ప్రారంభింస్తామని ఇప్పటికే మేకర్స్‌ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి