iDreamPost
android-app
ios-app

Salaar: సలార్ కాస్ట్యూమ్ తెచ్చిన తిప్పలు.. ఆ నటికి సర్జరీ.. అసలేం జరిగిందంటే..

  • Published Dec 26, 2023 | 2:42 PM Updated Updated Dec 26, 2023 | 2:42 PM

సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రీయా రెడ్డి సర్జరీ చేయించుకున్నారట. అసలేం జరిగింది అంటే..

సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రీయా రెడ్డి సర్జరీ చేయించుకున్నారట. అసలేం జరిగింది అంటే..

  • Published Dec 26, 2023 | 2:42 PMUpdated Dec 26, 2023 | 2:42 PM
Salaar: సలార్ కాస్ట్యూమ్ తెచ్చిన తిప్పలు.. ఆ నటికి సర్జరీ.. అసలేం జరిగిందంటే..

ఇద్దరూ పాన్ ఇండియా సూపర్ స్టార్ల కాంబినేషన్ లో వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తోంది సలార్ మూవీ. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆరేళ్లుగా ఎదురు చూస్తోన్న ప్రభాస్ ఖాతాలో సాలిడ్ హిట్ పడింది. సలార్ సినిమా చూసిన అభిమానులు.. ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ విజయం చేరింది. డిసెంబర్ 22 వచ్చిన సలార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ప్రభాస్ తో పోటీ పడ్డ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డంకీ చిత్రం.. బాక్సాఫీస్ రేసులో వెనకబడింది. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి ప్రాధాన పాత్రల్లో నటించారు.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో.. ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక విలన్ పాత్రలైతే.. హీరోతో సమానంగా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఇక తాజాగా వచ్చిన సలార్ సినిమాలో లేడీ విలన్ రాధారమ పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ లో నటించింది.. శ్రీయా రెడ్డి. తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్త కాదు. గతంలో టాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఈమె నటుడు విశాల్ వదిన కూడా. పైగా విశాల్ తిమురు (పొగరు) సినిమాలో శ్రీయా రెడ్డి విలన్ పాత్రలో అదరగొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు సలార్ సినిమాలో విలన్ పాత్రలో విజృంభించింది శ్రీయా రెడ్డి. ఆమె పోషించిన రాధారమ క్యారెక్టర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు.

surgery for sriya reddy

ఇక సలార్ లో చేసిన రాధారమ పాత్ర కోసం శ్రీయా రెడ్డి చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ వల్ల  బాగా ఇబ్బంది పడ్డారట. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రాధారమ బరువైన చెవి పోగులు ధరించి కనిపిస్తుంది. అందువల్ల ఆమె చెవులు చీరుకుపోయాయట. షూటింగ్ ముగిశాక సర్జరీ చేయించుకుందట. అలానే ఈ సినిమాలో ఆమె ధరించిన చీరల రంగులకు సంబంధించి కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో గొడవపడ్డానని తెలిపింది శ్రీయా రెడ్డి.

ఈ సందర్భంగా శ్రీయా రెడ్డి మాట్లాడుతూ… “ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కాస్ట్యూమ్స్ ఎక్కువగా డార్క్ కలర్స్ లో ఉంటాయి. సలార్ లో కూడా బ్లాక్, గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్స్ వాడారు. నాకు కూడా అదే రంగు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. కానీ నేను మాత్రం తనతో వాదించి మరీ పసుపు రంగు చీర ధరించాను” అని చెప్పుకొచ్చారు. సలార్ తర్వాత శ్రీయా రెడ్డి ఓజీ చిత్రంలో నటిస్తుందట. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో రానున్న ఓజీ మూవీలో కూడా ఆమెది నెగిటివ్ రోల్ అని ప్రచారం జరుగుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet