iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తర్వాతే అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!

  • Author ajaykrishna Updated - 01:31 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 01:31 PM, Tue - 12 September 23
ప్రభాస్ తర్వాతే అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్!

ఇండస్ట్రీలో ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలపై ఫ్యాన్స్ ఫోకస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అంటే.. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల గురించి కాదు. అనౌన్స్ మెంట్ జరిగి ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాల విషయంలో భారీ చర్చలు జరుగుతున్నాయి. కొందరు ప్రభాస్ సినిమా ముందంటే.. ఇంకొందరు అదేం లేదు ముందుగా అల్లు అర్జున్ సినిమానే వస్తుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ ఫ్యాన్స్ ఏ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు? అసలీ చర్చలు దేనికి? అనే వివరాల్లోకి వెళ్తే.. ముందుగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడుకోవాలి.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో డైరెక్టర్ గా సందీప్ రెడ్డి క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కి విస్తరించింది. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు పాన్ ఇండియా క్రేజ్ కోసం చాలా సినిమాలు చేయాల్సి వస్తుంది. కానీ.. ఒకే కథతో రెండు సినిమాలు తీసి.. రెండు సినిమాలు ఆయా భాషల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయంటే మామూలు విషయం కాదు. దీంతో ఇప్పుడు సందీప్ తీస్తున్న తదుపరి సినిమాలపై ఫోకస్ పడింది. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నాడు. డిసెంబర్ 1న ఆ సినిమా వరల్డ్ వైడ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా తర్వాత సందీప్ చేతిలో రెండు సినిమాలున్నాయి.

పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్ లతో బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కాంబినేషన్ లో సందీప్ ఈ సినిమాలు అనౌన్స్ చేశాడు. అయితే.. యానిమల్ కంప్లీట్ అవుతోంది కాబట్టి.. సందీప్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనే సందేహాలు మొదలైపోయాయి. అదేంటీ ముందు స్పిరిట్ ఉందిగా అనుకుంటే.. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలున్నాయి. మరోవైపు బన్నీ చేతిలో పుష్ప ఒకటే షూటింగ్ జరుపుకుంటుంది. సో.. ప్రభాస్ కంటే ముందు బన్నీ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్ మొదలైంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. యానిమల్ తర్వాత డెఫినెట్ గా ప్రభాస్ స్పిరిట్ ముందుగా ఉంటుందని.. ఆ తర్వాతే బన్నీ సినిమా అని తేల్చేశాడు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రభాస్, బన్నీ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet