iDreamPost
android-app
ios-app

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ న్యూస్.. మేకర్స్ ప్లానింగ్ ఏంటంటే?

  • Published Aug 24, 2024 | 11:44 AM Updated Updated Aug 24, 2024 | 11:44 AM

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

  • Published Aug 24, 2024 | 11:44 AMUpdated Aug 24, 2024 | 11:44 AM
Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ న్యూస్.. మేకర్స్ ప్లానింగ్ ఏంటంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ‘కల్కి’తో ఇటీవలే సంచలన విజయాన్ని అందుకున్న రెబల్ స్టార్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి తో ఫౌజీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ మూవీ రాబోతోంది. పాన్ ఆసియా లెవల్లో, భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో న్యూస్ వైరల్ గా మారుతూ వస్తోంది. తాజాగా స్పిరిట్ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ ప్రారంభం అయ్యే గ్యాప్ లో డార్లింగ్ ఇతర సినిమాలు చేసుకుంటాడట. అయితే ఈ మూవీ షూటింగ్ ను మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచే స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లానింగ్స్ గీస్తున్నట్లు సమాచారం.

కాగా.. జనవరి నుంచే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించి అదే సంవత్సరం చివరలో గానీ, 2026 సంక్రాంతికి స్పిరిట్ ను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా.. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. డార్లింగ్ చేతిలో ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్, కల్కి 2 లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ డేట్స్ మరో ఐదారు ఏళ్లదాక ఖాళీ  లేనట్లే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet