iDreamPost
android-app
ios-app

అర్షద్ వార్సీ కామెంట్స్ కు నాగ్ అశ్విన్ కౌంటర్.. ప్రభాస్ ను బెస్ట్ గా చూపిస్తా అంటూ

  • Published Aug 24, 2024 | 11:03 AM Updated Updated Aug 24, 2024 | 11:13 AM

Nag Ashwin Response Over Arshad Warsi Comments: ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కి పైన, ప్రభాస్ పైన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ నటులు కూడా దీనిపై స్పందించారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ కామెంట్స్ పై ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Nag Ashwin Response Over Arshad Warsi Comments: ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కి పైన, ప్రభాస్ పైన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ నటులు కూడా దీనిపై స్పందించారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ కామెంట్స్ పై ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 24, 2024 | 11:03 AMUpdated Aug 24, 2024 | 11:13 AM
అర్షద్ వార్సీ కామెంట్స్ కు నాగ్ అశ్విన్ కౌంటర్.. ప్రభాస్ ను బెస్ట్ గా చూపిస్తా అంటూ

ప్రేక్షకులు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా కంటెంట్ ను బట్టి సినిమాలను ఆదరిస్తున్నారు. అలాగే ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు అన్ని కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. కానీ దీనిని కొంతమంది బాలీవుడ్ నటులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. గతంలో కూడా టాలీవుడ్ సినిమాల గురించి పలు విమర్శలు చేసిన బి టౌన్ నటులు.. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి గురించి, ప్రభాస్ గురించి విమర్శించిన వీడియో సోషల్ మీడియా లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పటికే దీనిపై పలువురు సెలెబ్రటీలు స్పందించగా తాజాగా..డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను, కల్కి సినిమాను కామెంట్స్ చేయడంతో.. నెటిజన్లు అర్షద్ పై మండిపడుతున్నారు. టాలీవుడ్ సినిమాల సత్తా బాలీవుడ్ లో కనిపించడంతో.. తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ నటి నటులు కూడా అర్షద్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీనిపై స్పందించారు. నాగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఫిల్మ్ ఇండస్ట్రీ ని వెనక్కు లాగొద్దు.. బాలీవుడ్ , టాలీవుడ్ అనే బోర్డర్స్ చెరిగిపోయాయి. దేశం మొత్తం సినిమా ఒక్కటే అనే దృష్టితోనే ఫిల్మ్ ఇండస్ట్రీని చూడాలి. అర్షద్ కాస్త హుందాగా మాట్లాడాల్సింది. అయినా పర్లేదు మేము అతని పిల్లల కోసం.. కల్కి బుజ్జి టాయ్స్ పంపిస్తాము. కల్కి -2 కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్ ను బెస్ట్ గా చూపిస్తాను.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

మ్యాటర్ ను మరి పెద్దది చేయకుండా.. చాలా హుందాగా రెస్పాన్స్ ఇచ్చారు నాగ్ అశ్విన్. ఏదేమైనా నాగ్ అశ్విన్ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు ప్రేక్షకులంత అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. కాబట్టి నటి నటులు కూడా దీనికి సహకరిస్తే.. రానున్న రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకాస్త ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక నుంచైనా ఇలాంటి విమర్శలు చేయకుండా ఉంటె బావుంటుందని భావిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు డైరెక్టర్ మాటలను బట్టి చూస్తే.. కల్కి-2 విషయంలో నాగ్ ఎదో భారీగానే ప్లాన్ చేశాడనిపిస్తుంది. మరి అర్షద్ వార్సీ కామెంట్స్ కు నాగ్ అశ్విన్ స్పందించిన తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio