Nidhan
Prabhas Sets 1000 Crore Target For Jr NTR: ‘దేవర’తో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆయన ముందు బిగ్ టార్గెట్ ఉంది. ప్రభాస్ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకునే బాధ్యత తారక్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్‌పై కూడా ఉంది.
Prabhas Sets 1000 Crore Target For Jr NTR: ‘దేవర’తో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆయన ముందు బిగ్ టార్గెట్ ఉంది. ప్రభాస్ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకునే బాధ్యత తారక్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్‌పై కూడా ఉంది.
Nidhan
‘దేవర’ సినిమాతో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాన్నాళ్ల గ్యాప్ అనంతరం ఆయన నుంచి వస్తున్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కడం, ఇప్పటివరకు చిత్రం నుంచి బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అదిరిపోవడంతో ‘దేవర’ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొడితే సరిపోదు.. ఆయన అందుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెట్ చేసినది. డార్లింగ్ ఇచ్చిన టార్గెట్‌ను రీచ్ అవ్వాల్సిన బాధ్యత తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కూడా ఉంది. అసలు ఏంటా లక్ష్యం అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్లో రిలీజైన ఈ ఫిల్మ్.. వరల్డ్ వైడ్‌గా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. ‘బాహుబలి’ సిరీస్‌తో ఆల్రెడీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ చూసిన ప్రభాస్.. మరోమారు ‘కల్కి’తో ఆ ఫీట్ అందుకొని రికార్డు క్రియేట్ చేశాడు. అదే సమయంలో చరణ్, బన్నీ, తారక్‌కు రూ.1,000 కోట్ల టార్గెట్‌ను సెట్ చేశాడు. ఈ ఏడాది ఈ మైల్‌స్టోన్‌ను అందుకునే అరుదైన అవకాశం వీళ్ల ముగ్గురికీ ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’తో ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఏడాది ఆఖర్లో చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో బిగ్ స్క్రీన్స్‌లో సందడి చేయనున్నారు. కాబట్టి వీళ్ల ముగ్గురిలో ఎవరు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
చరణ్-తారక్ ఆల్రెడీ 1,000 కోట్ల కలెక్షన్స్ చూశారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆ ఫీట్‌ను అందుకున్నారు. కానీ అది మల్లీస్టారర్ కావడం, ఎక్కువ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళి ఖాతాలోకి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు పాన్ ఇండియా స్టేటస్‌ను మరింత బలోపేతం చేసుకోవాలంటే సోలోగా వచ్చి వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బన్నీ ఆల్రెడీ ‘పుష్ప’తో సౌత్‌తో పాటు హిందీ మార్కెట్‌నూ షేక్ చేశాడు. అయితే ఆ మూవీ సెకండ్ పార్ట్‌తో మరింత సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన మాదిరిగా కలెక్షన్స్ జాతర చేయాలి. ఈ ముగ్గురు హీరోలు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడితే టాలీవుడ్ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. మూడ్నెళ్ల గ్యాప్‌లో మూడు థౌజండ్ క్రోర్ ఫిల్మ్స్ ఒకే ఇండస్ట్రీ నుంచి పడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ముందు ‘దేవర’ నుంచే ఆ ప్రయత్నం మొదలవ్వాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు. మరి.. ప్రభాస్ టార్గెట్‌ను తారక్, చరణ్, బన్నీ రీచ్ అవుతారా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.