iDreamPost
android-app
ios-app

సలార్ సందడి షురూ.. ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్

  • Published Nov 12, 2023 | 11:25 AM Updated Updated Nov 12, 2023 | 11:25 AM

సలార్ సందడి షురూ అవుతోంది. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. ఆ రోజున ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సలార్ సందడి షురూ అవుతోంది. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. ఆ రోజున ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

  • Published Nov 12, 2023 | 11:25 AMUpdated Nov 12, 2023 | 11:25 AM
సలార్ సందడి షురూ.. ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దీపావళి పండుగవేళ సలార్ చిత్ర యూనిట్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు నటుడు ప్రభాస్. ప్రభాస్ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సలార్ ట్రైలర్ విడుదలపై బిగ్ అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

కొన్ని రోజుల క్రితం సలార్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సలార్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే అంటూ ప్రచారం జరుగగా నేడు అధికారికంగా చిత్రయూనిట్ సలార్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చింది. ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7.19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సలార్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.

భారీ యాక్షన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసిన సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş