iDreamPost
android-app
ios-app

Prabhas: సలార్ సక్సెస్ పై తొలిసారి స్పందించిన డార్లింగ్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!

  • Published Jan 01, 2024 | 9:48 PM Updated Updated Jan 02, 2024 | 10:49 AM

సలార్ సక్సెస్ పై తొలిసారి స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే?

సలార్ సక్సెస్ పై తొలిసారి స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే?

  • Published Jan 01, 2024 | 9:48 PMUpdated Jan 02, 2024 | 10:49 AM
Prabhas: సలార్ సక్సెస్ పై తొలిసారి స్పందించిన డార్లింగ్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!

సలార్, ప్రభాస్.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సలార్ ఇంత పెద్ద హిట్ అయినప్పటికీ.. యంగ్ రెబల్ స్టార్ ఇప్పటి వరకు ఈ సినిమాపై స్పందించిన దాఖలాలులేవు. తాజాగా సలార్ సక్సెస్ పై తొలిసారి స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సలార్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందని సమాచారం. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇదిలా ఉండగా.. సలార్ సక్సెస్ పై ఇప్పటి వరకు డార్లింగ్ స్పందించలేదు. అయితే ప్రభాస్ రియాక్ట్ అవ్వకపోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే? అతడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండకపోవడమే. కానీ ఫస్ట్ టైమ్ సలార్ సక్సెస్ పై స్పందించాడు యంగ్ రెబల్ స్టార్.

ఈ క్రమంలోనే అభిమానులందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో..”నేను ఖాన్సార్ ఫ్యూచర్ ను నిర్ణయిస్తాను. మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుపుకోండి. సలార్ ను ఈ రేంజ్ లో ఆదరించిన మీ అందరికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో డార్లింగ్ కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. కామెంట్స్ పెడుతున్నారు. ఇక సలార్ లో హీరోయిన్ గా శృతిహాసన్ నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, బాబీ సింహాతో పాటుగా పలువురు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మరి సలార్ సక్సెస్ పై ప్రభాస్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş