Kalki 2898 AD Crosses Rs 500 Crore Worldwide: కల్కి ప్రభంజనం.. 4 రోజుల్లోనే రికార్డు.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక

Kalki 2898 AD: కల్కి ప్రభంజనం.. 4 రోజుల్లోనే రికార్డు.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక

Kalki Collections: భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి చిత్రం.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో సినిమా విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే కల్కి అరుదైన ఘనత సాధించింది. ఆ వివరాలు..

Kalki Collections: భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి చిత్రం.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో సినిమా విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే కల్కి అరుదైన ఘనత సాధించింది. ఆ వివరాలు..

డార్లింగ్‌ ప్రభాస్‌, మోస్ట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఐదు రోజుల క్రితం అనగా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే కల్కి ప్రభంజనం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతుంది. ఇక ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి.. మహాభారతానికి లింక్‌ పెట్టి.. శ్రీ మహావిష్ణువు పదో అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కల్కి విడుదల తర్వాత.. మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది.

అదలా ఉంచితే కల్కి చిత్రం అరుదైన రికార్డ్‌ సాధించింది. ఈ చిత్రం విడుదలై వారం రోజులు కూడా కాకముందే.. 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అయితే ప్రభాస్‌ ఖాతాలో ఇలాంటి రికార్డ్‌ కొత్త కాకపోయినా.. తక్కువ కాలంలో కల్కి ఆ ఫీట్‌ సాధించడం విశేషం అంటున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి చిత్రాలు.. వందల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. బాహుబలి 2 తప్ప మిగతావన్ని వందల కోట్ల క్లబ్‌లో చేరడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. కానీ కల్కి మాత్రం.. విడుదలైన 4 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి అరుదైన ఘనతను సంపాదించుకుంది.

ప్రభాస్‌ కథానాయకుడిగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. విడుదలకు ముందు నుంచే కల్కి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద​ కల్కి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసిదనే విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ ఎక్స్‌లో పోస్టు చేసింది.

కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు రూ.191.5 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా.. రెండ‌వ రోజు రూ.95.3 కోట్ల వ‌సూళ్లను సాధించింది. మూడు రోజుల్లో రూ.415 కోట్లు వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. నాలుగో రోజైన ఆదివారం ఫస్ట్‌ షో పడే సమయానికి కల్కి  రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ వీకెండ్‌ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌ సాధించింది. ఇక ఈ మూడు రోజుల్లో అనగా విడుదలైన వన్‌ వీక్‌లోపే.. కల్కి 1000 కోట్ల క్లబ్‌లో చేరవచ్చు అని అంచనా వేస్తున్నారు.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ సినిమాను నిర్మించారు. ఈసినిమాలో.. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, శోభన కీలక పాత్రలు చేయగా.. దిశా పటాని, శోభన, అన్నా బెన్, దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్జీవీ, కేవీ అనుదీప్, అవసరాల శ్రీనివాస్, ఫరియా అబ్దుల్లాలు గెస్ట్ రోల్స్‌లో మెరిశారు. ఇక కల్కి పార్ట్‌-2 మీద అంచనాలు మరింత పెరిగాయి.

Show comments