Dharani
Kalki Collection: ఆరో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కల్కి వేట కొనసాగుతోంది. ఇక రెబలోడి ఊచకోతకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ దెబ్బకు స్టార్ హీరోల రికార్డ్స్ అన్ని బద్దలవుతున్నాయి.
Kalki Collection: ఆరో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కల్కి వేట కొనసాగుతోంది. ఇక రెబలోడి ఊచకోతకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ దెబ్బకు స్టార్ హీరోల రికార్డ్స్ అన్ని బద్దలవుతున్నాయి.
Dharani
కల్కి.. ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీలో.. ఎవరు టచ్ చేయని పాయింట్ అయిన.. పురాణాలను యుగాంతానికి లింక్ చేసి.. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించి.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఇండియన్ కథకు.. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ జత చేసి.. ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా నిలిచిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లను ప్రాధాన పాత్రల్లో తీసుకుని.. వారికి పోటీగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రంగంలోకి దించి కల్కిని తెరకెక్కించాడు. సుమారు 600 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆరు రోజుల క్రితం అనగా జూన్ 27న తెలుగు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
కల్కికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సినిమాను ఎంతలా ఆదరిస్తున్నారంటే.. విడుదలైన 5 రోజుల్లోనే 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వీకెండ్ నాటికి 1000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే దిశగా పరుగులు తీస్తోంది. ఇక గత ఐదురోజులకు ఏమాత్రం తగ్గకుండా.. ఆరో రోజు కూడా భారీ వసూళ్లు సాధించి.. ప్రభాస్ రేంజ్ ఇది అని మరోసారి చాటింది కల్కి చిత్రం. వీకెండ్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లలో కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద తన వేటను కొనసాగిస్తుంది.
ఆరో రోజు కూడా కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆరు రోజుల్లో కల్కి.. రజనీకాంత్ జైలర్, విజయ్ లియో కలెక్షన్స్‌ను దాటేసింది. ఆరు రోజుల్లో రజనీ జైలర్ 604.5 కోట్లు వసూలు చేయగా.. విజయ్ లియో 605.9 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ప్రభాస్ కల్కి.. ఈ రెండు సినిమాల రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తూ.. 675 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
ఏపీ, తెలంగాణలో టోటల్- 7.89 కోట్లు గ్రాస్ 12.2 కోట్లు