iDreamPost
android-app
ios-app

షారూఖ్ రికార్డ్స్‌పై ప్రభాస్ పంజా! తాజాగా ఇంకోటి లేపేశాడు!

డార్లింగ్ ప్రభాస్ మరో రికార్డును సృష్టించాడు. గత కొంత కాలంగా షారూఖ్ రికార్డులపై కన్నేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అక్కడ షారూఖ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి.. తన జెండా పాతాడు డార్లింగ్.

డార్లింగ్ ప్రభాస్ మరో రికార్డును సృష్టించాడు. గత కొంత కాలంగా షారూఖ్ రికార్డులపై కన్నేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అక్కడ షారూఖ్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి.. తన జెండా పాతాడు డార్లింగ్.

షారూఖ్ రికార్డ్స్‌పై ప్రభాస్ పంజా! తాజాగా ఇంకోటి లేపేశాడు!

రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్న ప్రభాస్‌కే సాధ్యం అన్నట్లుగా మారింది. కల్కి 2898ఏడీతో మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ మూవీ.. నాన్ స్టాప్‌గా దూసుకెళుతుంది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ.. థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటం విశేషం. ఇతిహాసాలకు సైన్ ఫిక్షన్ జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త వరల్డ్ క్రియేట్ చేసి మ్యాజిక్ చేసేశాడు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు చిన్న, పెద్దా అంతా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేశారు. ఇక్కడే కాదు ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుంది. డార్లింగ్ తన పాత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. నార్త్ అమెరికాలో ఈ మూవీ హవా కొనసాగుతూనే ఉంది.

నార్త్ అమెరికాలో సినిమా విడుదలకు ముందు నుండి రికార్డులు సొంతం చేసుకుంది కల్కి. ప్రీ బుకింగ్స్ సేల్స్ దగ్గర నుండి.. ప్రీమియర్ కలెక్షన్లలో కూడా సరికొత్త రికార్డులును నెలకొల్పింది. ప్రీమియర్స్‌లోనే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను క్రాష్ చేసింది. ఇప్పుడు కలెక్షన్ల పరంగా పఠాన్ మూవీ రికార్డును కూడా చెరిపేసింది. ప్రభాస్ కల్కి 18.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. గతంలో షారూఖ్ నటించిన పఠాన్ 17.45 మిలియన్ డార్లతో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ ప్లేసును రీ ప్లేస్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఉత్తర అమెరికాలో ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతుంది.

గత కొంత కాలంగా బాలీవుడ్ బాద్ షా రికార్డులను టార్గెట్ చేస్తూ ప్రభాస్ తన స్టామినాను చూపుతున్నాడు. గత ఏడాది సలార్, డంకీ మూవీలు ఓకే సారి పోటీ పడగా..  డంకీ కన్నా సలార్ మూవీకే కాసుల వర్షం కురిసిన సంగతి విదితమే. అలాగే పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1200 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఆ రికార్డుపై కూడా కన్నేశాడు డార్లింగ్. ఇప్పటికే రూ. 1100 మార్క్ దాటేసిన సంగతి విదితమే. ఇప్పుడు నార్త్ అమెరికా కలెక్షన్ల విషయంలో కూడా పఠాన్ ను దాటేసింది కల్కి. ఓవరాల్ కలెక్షన్లను దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ నాలుగేళ్ల ప్రతిఫలానికి ఫలితం దక్కినట్లయ్యింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి 2898ఏడీ తొలి షో నుండి మూవీకి పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్ రావడంతో ప్రతి ఒక్కరూ మూవీని చూసి ఎంజాయ్ చేశారు.

ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దిగ్గజ నటులు యాక్ట్ చేశారు. దీపికా పడుకునే, దిశా పటానీ వంటి ముద్దుగుమ్మలే కాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిధి పాత్రల్లో మెప్పించిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే కల్కి బృందం సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కొంత మంది అభిమానుల కసం ప్రత్యేకమైన షో ప్రదర్శంచనున్నట్లు సమాచారం. అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చిన పోస్టులో సూచాయగా ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇక పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.