Krishna Kowshik
డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కల్కి 2898 ఏడీ. మూవీ విడుదలయ్యి 40 రోజులు దాటినా ఇంకా సక్సెస్ ఫుల్ రన్ రేటుతో దూసుకెళుతోంది. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా
డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కల్కి 2898 ఏడీ. మూవీ విడుదలయ్యి 40 రోజులు దాటినా ఇంకా సక్సెస్ ఫుల్ రన్ రేటుతో దూసుకెళుతోంది. ఇప్పుడు రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా
Krishna Kowshik
బాక్సాఫీసుకు అసలు సిసలైన కలెక్షన్లు రుచి చూపించిన కింగ్ ప్రభాస్. కల్కి 2898ఏడీ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ రేటుతో దూసుకెళుతుంది. మూవీ విడుదలై 40 రోజులు దాటుతున్నా.. వసూళ్లలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒక్కటిగా కల్కి నిలిచింది. భైరవ, అర్జున పాత్రలో కేక పుట్టించాడు రెబల్ స్టార్. ఇక బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, కోలీవుడ్ టాప్ హీరో కమల్ హాసన్ కల్కి మూవీకి అదనపు ఎట్రాక్షన్. వీరికి తోడు దీపికా పడుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్ తమ యాక్టింగ్‌తో సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక్కడ కాదు ఓవర్సీస్‌లో సైతం ప్రీ బుకింగ్ నుండే రికార్డులు సృష్టిస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఇండియాలోనూ సరికొత్త చరిత్రను నెలకొల్పింది కల్కి.
భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా షారూఖ్ ఖాన్ మూవీ జవాన్ రికార్డులను బద్దలు కొట్టింది కల్కి. దేశంలో అత్యధిక వసూళ్లు చేసి చిత్రాల్లో నాల్గొవ స్థానంలో నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత అత్యథిక వసూళ్లు రాబట్టుకున్న మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు బాద్ షా-అట్లీ మూవీ జవాన్ రూ.1160 కోట్లతో నాల్గొవ స్థానంలో నిలువగా.. ఇప్పుడు ఈ చిత్రం అధిగమిచింది. జవాన్ ప్లేసును రీ ప్లేస్ చేసింది కల్కి 2898ఏడీ. అలాగే నెట్ కలెక్షన్లలో కూడా ప్రభాస్ మూవీనే పై చేయి సాధించింది. జవాన్ మొత్తం రూ. 640.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే.. కల్కి రూ. 641.13 కోట్ల నెట్ మార్క్‌ను అధిగమించింది. ఇలా గ్రాస్ అండ్ నెట్లో షారూఖ్‌ను దాటేశాడు తిరుగులేని రారాజుగా నిలిచాడు డార్లింగ్ ప్రభాస్. నాలుగు హయ్యెస్ట్ కలెక్షన్స్ చిత్రాల్లో నాలుగు దక్షిణాది చిత్రాలు కావడం విశేషం.
అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌లో జవాన్ ముందు వరుసలో ఉంది. రూ. 1160 కోట్లు రాబడితే.. కల్కి రూ. 1100 కోట్లు సాధించింది. అంటే మరో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రభాస్.. మరోసారి సారి కింగ్ ఖాన్ ను కలెక్షన్ల పరంగా వెనక్కు నెట్టినట్లు అవుతుంది. ఆగస్టు 9 వరకు వంద రూపాయలకే సినిమా టికెట్ ప్రకటించడంతో థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది ఈ మూవీ. ఆగస్టు 15 వరకు పెద్ద సినిమాలు లేని పక్షంలో ఈ మార్క్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తుంది. ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్ జోడించి.. వెండితెరపై అద్భుతం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, అనుదీప్, ఫరియా అబ్దుల్లా వంటి స్టార్స్ అదనపు హంగులు అద్దారు.