iDreamPost
android-app
ios-app

గోపీచంద్- శ్రీనువైట్ల విశ్వం మూవీలో ప్రభాస్!

  • Published Jul 15, 2024 | 9:16 PM Updated Updated Jul 15, 2024 | 9:16 PM

Prabhas- Gopichand And Srinu Vaitla Movie: ప్రభాస్- గోపీచంద్ ఫ్రెండ్ షిప్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీళ్లు వర్షం తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. వీళ్ల మల్టీస్టారర్ ఎప్పుడు అనే ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక క్రేజీ వార్త మాత్రం వైరల్ అవుతోంది.

Prabhas- Gopichand And Srinu Vaitla Movie: ప్రభాస్- గోపీచంద్ ఫ్రెండ్ షిప్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీళ్లు వర్షం తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. వీళ్ల మల్టీస్టారర్ ఎప్పుడు అనే ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక క్రేజీ వార్త మాత్రం వైరల్ అవుతోంది.

  • Published Jul 15, 2024 | 9:16 PMUpdated Jul 15, 2024 | 9:16 PM
గోపీచంద్- శ్రీనువైట్ల విశ్వం మూవీలో ప్రభాస్!

ప్రస్తుతం ప్రభాస్ నామ సంవత్సరం నడుస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత థియేటర్స్ దగ్గర సందడి మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించి ఒక క్రేజీ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. అటు మ్యాచోమ్యాన్ గోపీచంద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. గోపీచంద్- శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న విశ్వం అనే యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభాస్ ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ప్రభాస్ ఏం చేయబోతున్నాడు అంటూ లీకుల మీద లీకులు వస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ ఇద్దరు మిత్రుల గురించే చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరు ఆఫ్ ది స్క్రీన్ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. వీళ్లు ఒక దగ్గర ఉంటే రచ్చ రచ్చ అవుతుంది. అయితే వీళ్లిద్దరినీ స్క్రీన్ మీద కలిపి చూడాలి అనేది ఫ్యాన్స్ కోరిక. వర్షం తర్వాత మళ్లీ ఆ కలయిక సాధ్యం కాలేదు. అయితే ఒకసారి వీళ్ల కాంబోలో ఒక క్రేజీ మల్టీ స్టారర్ రాబోతోంది అని చెప్పారు. కానీ, అది వార్తలాగే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం గోపీచంద్- శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న విశ్వం సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మెలిక ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వం సినిమాలో ప్రభాస్ ఉన్న మాట వాస్తవమే కానీ.. పాత్ర కాదంట. హీరో గోపీచంద్ క్యారెక్టర్ ని పరిచయం చేసేందుకు వాయిస్ ఓవర్ ఇస్తాడట. ప్రస్తుతం ఈ వార్త మాత్రం టాలీవుడ్ వర్గాల్లో బాగానే వైరల్ అవుతోంది. దాదాపుగా విశ్వం సినిమా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది అంటున్నారు. అయితే ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఇంక విశ్వం సినిమా విషయానికి వస్తే.. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న అప్ డేట్స్ చూస్తే ఆ విషయంపై క్లారిటీ ఉంది. ఇంక శ్రీనువైట్ల ఎంత కొత్తగా చూపిస్తాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభాస్ వాయిస్ ఓవర్ అనే వార్త రాగానే.. విశ్వం సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది అంటున్నారు. గోపీచంద్ కి కూడా ఒక సరైన హిట్టు పడబోతోంది అంటూ అప్పుడే టాక్ స్టార్ట్ అయిపోయింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss