iDreamPost
android-app
ios-app

లోకేష్ కథకు ప్రభాస్ ఫిదా..! LCU లో డార్లింగ్ ఎంట్రీ..?

  • Published Nov 04, 2024 | 10:58 AM Updated Updated Nov 04, 2024 | 10:58 AM

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇండస్ట్రీలో ఓ పెద్ద సెన్సేషన్. అతని కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ యూనివర్స్ లో అసలే బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ పేరు వినిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇండస్ట్రీలో ఓ పెద్ద సెన్సేషన్. అతని కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ యూనివర్స్ లో అసలే బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ పేరు వినిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

  • Published Nov 04, 2024 | 10:58 AMUpdated Nov 04, 2024 | 10:58 AM
లోకేష్ కథకు ప్రభాస్ ఫిదా..! LCU లో డార్లింగ్ ఎంట్రీ..?

ఓ సాదా సీదా స్టార్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మొదలు పెట్టి.. బడా హీరోలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు లోకేష్ కనగరాజ్. తీసింది చాలా కొద్దీ సినిమాలే. అయినా సరే  ఈ దర్శకుడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లోకేష్ కాన్సెప్ట్స్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు సైతం షేక్ అయ్యారు. ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఓ సెన్సేషన్ అని చెప్పి తీరాల్సిందే. ఖైదీ , విక్రమ్ సినిమాలలో కథను చూపించిన తీరు బట్టి.. ఈ దర్శకుడు వర్క్ ఏంటో ప్రూవ్ అయిపోయింది. ఖైదీ , విక్రమ్ సినిమాలకు లింక్ ఉందని విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో చూపించాడు. దీనితో ఇప్పుడు తర్వాత ఏమౌతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో చాలానే సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి.

కూలి, ఖైదీ 2, విక్రమ్ 2 , రోలెక్స్ లాంటి కిక్ ఇచ్చే ప్రాజెక్ట్స్ రానున్నాయి. దాదాపు వచ్చే ఏడాది ఖైదీ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత రోలెక్స్ మూవీ రాబోతుంది. ఇదంతా సరే.. ఇప్పుడు LCU లో కొత్తగా తెలుగు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ , ప్రభాస్ తో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేశారట మేకర్స్. ఎన్టీఆర్ సంగతి తెలియదు కానీ.. డార్లింగ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అసలే ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా సరే లోకేష్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట డార్లింగ్. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా గతంలో ఓ సారి వెల్లడించారు లోకేష్. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఒకే చెప్పడంతో.. ప్రేక్షకులలో ఎక్కడలేని ఉత్సాహం మొదలైంది. దాదాపు ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ అయితే 2026 ఆఖరి వరకు బిజినే.. ఆపైన ఇంకా సమయం పట్టినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అటు లోకేష్ కూడా అదే తరహాలో బిజీగా ఉన్నాడు. మరి ప్రభాస్ ఫ్రీ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా.. లేక లోకేష్ ఖైదీ , కూలి సినిమాల తర్వాత ఈ సినిమాను తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పైగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయబోతున్నాడట. అసలు ప్రభాస్ కట్ అవుట్ కి.. లోకేష్ మేకింగ్ ని యాడ్ అయితే మాత్రం కచ్చితంగా చరిత్ర సృష్టించినట్లే. ఇప్పటికే ప్రభాస్ చేతిలో గంపెడు ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. వీటిని చూసే ఇండస్ట్రీ అంతా నోటి మీద వేలు వేసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్స్ గురించి ప్రోపర్ అప్డేట్స్ రాకముందే.. ఇప్పుడు ప్రభాస్ మరో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. ఈ న్యూస్ లు ఎవరికీ ఎలా అనిపించినా కానీ… డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రం మంచి జోష్ ను ఇస్తున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş