iDreamPost
android-app
ios-app

Prabhas: ‘ది రాజా సాబ్’.. మారుతికి టార్గెట్ ఇచ్చిన ప్రభాస్ ! ఏంటంటే?

  • Published Sep 14, 2024 | 9:56 AM Updated Updated Sep 14, 2024 | 10:38 AM

Prabhas given a target to director Maruthi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ విషయంలో డైరెక్టర్ మారుతికి టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas given a target to director Maruthi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ విషయంలో డైరెక్టర్ మారుతికి టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 14, 2024 | 9:56 AMUpdated Sep 14, 2024 | 10:38 AM
Prabhas: ‘ది రాజా సాబ్’.. మారుతికి టార్గెట్ ఇచ్చిన ప్రభాస్ ! ఏంటంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఇప్పటి వరకు టచ్ చేయని హార్రర్ రొమాంటిక్ జోనర్ లో ఈ చిత్రం రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ డైరెక్టర్ మారుతికి ఓ టార్గెట్ ను ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి మారుతికి ఇచ్చిన ఆ టార్గెట్ ఏంటి? ఎందుకు ఇచ్చాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కల్కి మూవీతో గ్లోబల్ రేంజ్ లో హిట్ కొట్టి మంచి జోరుమీదున్నాడు. ఇక ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీకి ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మారుతికి పెద్ద టార్గెట్ నే ఇచ్చాడట ప్రభాస్. తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ను అక్టోబర్ లో పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పటి వరకు టాకీ మాత్రమే షూట్ చేస్తూ వచ్చిన మేకర్స్ పాటలను కూడా షూట్ చేయాలని భావిస్తున్నారట. ఇక తన పోర్షన్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మారుతిని ప్రభాస్ కోరినట్లు సమాచారం.

అయితే ప్రభాస్ ఇలా డెడ్ లైన్ విధించడానికి కారణాలు లేకపోలేదు. డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) సినిమాను ఇటీవలే పట్టాలెక్కించాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని సైతం జరుపుకొంది. ఇక మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మూవీ కమిట్ అయ్యాడు డార్లింగ్. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ కు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు చిత్రాలు స్టార్ట్ కాకముందే.. తన ది రాజా సాబ్ షూట్ ను కంప్లీట్ చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. అందుకే మారుతిని స్పీడ్ చేస్తున్నాడు. ఇక ది రాజా సాబ్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఈ మూవీపై నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. రాజా సాబ్ పక్కా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని దృఢంగా ఉన్నారు. హార్రర్ రొమాంటిక్ కామెడీ కావడంతో.. ప్రేక్షకులు సైతం డార్లింగ్ ఎలా యాక్టింగ్ చేశాడో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet