iDreamPost
android-app
ios-app

Iman Esmail: ప్రభాస్ తో మూవీ.. ఇమాన్ కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్! ఎంతో తెలుసా?

  • Published Aug 22, 2024 | 8:03 PM Updated Updated Aug 22, 2024 | 8:03 PM

ఫస్ట్ మూవీతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది ఇమాన్ ఇస్మాయిల్. అయితే ఈ సినిమాకు ఆమె కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్ మూవీతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది ఇమాన్ ఇస్మాయిల్. అయితే ఈ సినిమాకు ఆమె కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

  • Published Aug 22, 2024 | 8:03 PMUpdated Aug 22, 2024 | 8:03 PM
Iman Esmail: ప్రభాస్ తో మూవీ.. ఇమాన్ కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్! ఎంతో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంది టీమ్. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో ఇమాన్ ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ అయిన ఈ సోషల్ మీడియా ఇన్స్ ప్ల్యూయెన్సర్ ను ప్రభాస్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఈ మూవీకి ఇమాన్ తీసుకునే రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ వార్త హల్ చేయడం మరొకెత్తు.

ఇమాన్ ఇస్మాయిల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. దానికి కారణం ఆమె ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడమే. ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ(వర్కింగ్ టైటిల్) మూవీలో ఇమాన్ ఇస్మాయిల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తొలి సినిమాకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో అవకాశం రావడంతో.. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కాగా.. ఈ మూవీకి ఇమాన్ ఏకంగా రూ. కోటి రూపాయల కళ్లు చెదిరే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

తొలి సినిమాతోనే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా ఇమాన్ టాప్ లిస్ట్ లో నిలిచింది. ఇంతకు ముందు విక్టరీ వెంకటేష్ నటించిన ‘మళ్లీశ్వరి’ మూవీకి గాను బాలీవుడ్  బ్యూటీ కత్రీనా కైఫ్ అప్పట్లోనే రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుని, తొలి సినిమాకే ఇంత తీసుకున్న హీరోయిన్ గా నిలిచినట్లు టాక్ వచ్చింది. అయితే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ రూ. 2 కోట్ల కంటే తక్కువే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ తొలి మూవీతోనే ఇమాన్ ఇలాంటి జాక్ పాక్ కొట్టడం విశేషం. మరి తొలి సినిమాతోనే ఈ రేంజ్ పారితోషికం ఇమాన్ ఇస్మాయిల్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss