iDreamPost
android-app
ios-app

Saripoda Sanivaaram: గ్రాండ్ గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్! ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Aug 22, 2024 | 7:42 PM Updated Updated Aug 22, 2024 | 7:42 PM

సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో నాని బిజీబిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు? ఎక్కడ? నిర్వహించనున్నారో మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి చెప్పారు.

సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో నాని బిజీబిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు? ఎక్కడ? నిర్వహించనున్నారో మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి చెప్పారు.

  • Published Aug 22, 2024 | 7:42 PMUpdated Aug 22, 2024 | 7:42 PM
Saripoda Sanivaaram: గ్రాండ్ గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్! ఎప్పుడు? ఎక్కడంటే?

న్యాచురల్ స్టార్ నాని-వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’. అంటే సుందరానికి మూవీ తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకులతో పాటుగా క్లాస్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. నాని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

సరిపోదా శనివారం నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఇక తన జానర్ నుంచి బయటకొచ్చి ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఆ విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఆగస్ట్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చెన్నైలో నాని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు. తాజాగా తమిళ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా.. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి రెడీ అయ్యారు.

ఆగస్ట్ 24న హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్ లో సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపనున్నారు. సాయంత్ర 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కథ ఇప్పటికే అందరికి తెలిసిపోయింది. శనివారం మాత్రమే విలన్స్ ను వేటాడే హీరో కథ ఇది. ఇందులో విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తుండగా.. నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. డీవివి ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీపై ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet