iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫౌజీ టీజర్ అప్పుడే ?

  • Published Sep 20, 2024 | 11:29 AM Updated Updated Sep 20, 2024 | 11:29 AM

Prabhas Fauji Movie Update: కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Prabhas Fauji Movie Update: కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Sep 20, 2024 | 11:29 AMUpdated Sep 20, 2024 | 11:29 AM
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫౌజీ టీజర్ అప్పుడే ?

టాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రభాస్ తన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కొల్లగొట్టిన ప్రభాస్.. తన తర్వాత ప్రాజెక్ట్స్ ను కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు . ప్రభాస్ స్పీడ్ చూస్తే అటు అభిమానులు.. ఇటు ఇండస్ట్రీ.. అంతా నోటి మీద వేలు వేసుకుంటున్నారు. మినిమమ్ వందల కోట్ల బడ్జెట్ తో.. కనీసం ఏడాది ఒక సినిమా అయినా చేస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలో ఇటీవల హను రాఘవపూడి.. ప్రభాస్ కాంబినేషన్ లో ఫౌజీ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి తర్వాత.. వెంటనే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా పూర్తవ్వకముందే మరో మూవీని కూడా స్టార్ట్ చేసి.. తన స్పీడ్ తో అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి. పక్కా ప్లానింగ్ ఉంటే కానీ.. దర్శకులు ప్రభాస్ తో సినిమాకు రెడీ అవ్వరు. ఇక రీసెంట్ గా ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్ లో ‘ఫౌజీ’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్నీమధ్యనే దానికి సంబంధించిన అనౌన్సుమెంట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఇలా మూవీ సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఫౌజీ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ లేదా టీజర్ ను ఈ దసరా కు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగానే ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి.

ఇక ఫౌజీ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధురై లో మొదలైంది . అయితే ఇప్పటికి ఈ మూవీని ప్రభాస్ లేకుండానే కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారట. మారుతితో ది రాజా సాబ్ షూటింగ్ ముగించుకుని.. అప్పుడు ప్రభాస్ ఫౌజీ షూట్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ మూవీ 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులలో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో.. ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాయో వేచి చూడాలి. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా ఎలాగూ కల్కి పార్ట్-2, సలార్-2, స్పిరిట్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో చూడాలి. మరి ఈ సినిమాల అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet