iDreamPost
android-app
ios-app

ప్రభాస్ అభిమానుల మౌన దీక్ష.. వీరి కష్టం ఎవరికి రాకూడదు.!

Prabhas Fans Silence Protest: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో ఉంటే.. మరికొందరు మాత్రం మౌన దీక్ష చేస్తున్నారు.

Prabhas Fans Silence Protest: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో ఉంటే.. మరికొందరు మాత్రం మౌన దీక్ష చేస్తున్నారు.

ప్రభాస్ అభిమానుల మౌన దీక్ష.. వీరి కష్టం ఎవరికి రాకూడదు.!

సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా అంటే.. ఫ్యాన్స్ కి పండగే. ముందురోజు నుంచే థియేటర్ల ముందు సందడి చేస్తుంటారు. అలానే టికెట్ బుకింగ్ ఓపెన్ కావడమే ఆలస్యం…వాటిని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అలానే తమ హీరో సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా రచ్చ చేస్తుంటారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు మాత్రం మౌన దీక్ష చేస్తున్నారు. మరి.. ఈలు, గోలు చేస్తూ సందడి చేయాల్సిన వాళ్లు అలా నిరసన ఎందుకు చేస్తున్నారు?.  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా ఎలా ఉంటారు. ఏముంది తమ హీరో సినిమా విషయంలో ఈలలు వేస్తూ, గోలలు  చేస్తూ, కేకలు పెడుతూ..పెద్ద హంగామా చేస్తుంటారు.  కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం విచిత్రమైన కార్యక్రమానికి పూనుకున్నారు. కల్కి సినిమాకు సంబంధించి ఓ విషయంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఇక అసలు విషయం తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే  ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.

ఈ క్రమంలోనే కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారీ డిమాండ్ కూడా ఏర్పడటంతో.. క్షణాల్లోనే అన్ని టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇది ఇలా ఉంటే. కొన్నిచోట్ల మాత్రం ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంలేదట. దాంతో ప్రభాస్ అభిమానులు కొంతమంది మౌన దీక్షకు దిగారు. తమ ప్రాంతాల్లో కూడా వెంటనే టికెట్ బుకింగ్స్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా… నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక కల్కి 2898ఏడీ  సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,  దీపిక పదుకోనే, శోభన వంటి పలువురు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో కల్కితో పాటు భైరవది కీలక రోల్ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.  విడుదలకు రెండు రోజులే సమయంలో ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే  సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను మూవీ టీమ్ రివిల్ చేస్తుంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/