iDreamPost
android-app
ios-app

కెనడాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అరాచకం.. 6 హెలికాప్టర్లతో సెల్యూట్‌!

  • Published Dec 16, 2023 | 1:40 PM Updated Updated Dec 16, 2023 | 2:39 PM

ఈ ఏడాది మోస్ట్ వెయిట్ మూవీగా నిలిచిపోయింది సలార్. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలో విడుదలకు సిద్ధమైంది. బాక్సాఫీస్ కలెక్షన్లను కుమ్మేసేందుకు డిసెంబర్ 22న డైనోసార్ వస్తోంది.

ఈ ఏడాది మోస్ట్ వెయిట్ మూవీగా నిలిచిపోయింది సలార్. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలో విడుదలకు సిద్ధమైంది. బాక్సాఫీస్ కలెక్షన్లను కుమ్మేసేందుకు డిసెంబర్ 22న డైనోసార్ వస్తోంది.

  • Published Dec 16, 2023 | 1:40 PMUpdated Dec 16, 2023 | 2:39 PM
కెనడాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అరాచకం.. 6 హెలికాప్టర్లతో సెల్యూట్‌!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం సలార్- ది సీజ్ ఫైర్. ఇప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమాపై ఉన్న అంచనాలు పెంచేశాయి. కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్టేజియస్‌గా ఈ పిక్చర్‌ను తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలో శృతి హాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహ, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. పలుమార్లు వాయిదా పడిన  ఈ పాన్ ఇండియా చిత్రం ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సలార్ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత పాన్ ఇండియా కాదూ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. అతడికి ఇండియాలోనే కాదూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు కెనడాలోని ఫ్యాన్స్. ఆరు హెలికాఫ్టర్లతో వినూత్న ప్రదర్శన చేపట్టారు. హెలికాఫ్టర్లను గాల్లోకి లేపి.. రెబల్ స్టార్‌కు ఎయిర్ సెల్యూట్ చేశారు. ఈ వీడియోను చిత్ర యూనిట్ హోంబలే ఫిల్మ్స్ షేర్ చేసుకుంది. ఈ వీడియో చూస్తుంటే.. ఏం అభిమానం రా వీరిది అనిపించకమానదు. సినిమాటిక్ రేంజ్‌లో, తమ ఇష్టాన్ని ప్రదర్శించారు. అరాచకం సృష్టించారంతే.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కెనడాలోని టొరంటోలో ప్రభాస్ ఫ్యాన్స్ కనివినీ ఎరుగని రీతిలో అభిమానాన్ని కనబర్చారు. ఓ విశాలమైన మైదానంలో ఆరు హెలికాఫ్టర్లను గాల్లోకి లేపి.. సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉంచారు. మైదానంలో భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ వీడియో చూస్తుంటేనే కాదూ.. వీడియో వింటుంటే.. ఒళ్లు జలదరిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు కడుపు నిండుతోంది. ఇక ఈ మూవీ అమెరికాలో ప్రీ బుకింగ్స్ అరగంటలో 10 వేల టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అదీ ఈ రెబల్ స్టార్‌కు ఉన్న క్రేజ్ అని తెలుస్తోంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీలతో ప్రభాస్ నిరాశపరిచినా.. తమ అభిమానాన్ని అతడిపై అలానే కొనసాగిస్తున్నారు ఈ డై హార్ట్ ఫ్యాన్స్. ఈ డైనోసార్ కేకలు పుట్టించనుందని భావిస్తున్నారు. మరీ ఈ పిక్చర్ పై మీ అంచనాలు ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş