iDreamPost
android-app
ios-app

డంకీని ఆడేసుకుంటున్నారు.. ప్రభాస్ ఫ్యాన్స్ తగులుకుంటే ఇలాగే ఉంటది!

  • Published Dec 21, 2023 | 9:02 PM Updated Updated Dec 21, 2023 | 9:02 PM

Prabhas Fans On Dunki: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్- షారుక్ ఖాన్ మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రభాస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

Prabhas Fans On Dunki: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్- షారుక్ ఖాన్ మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రభాస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

  • Published Dec 21, 2023 | 9:02 PMUpdated Dec 21, 2023 | 9:02 PM
డంకీని ఆడేసుకుంటున్నారు.. ప్రభాస్ ఫ్యాన్స్ తగులుకుంటే ఇలాగే ఉంటది!

సాధారణంగా ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. అంటే ఒక హీరో సినిమా దేశవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల అవుతోంది. అంటే రెండు పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఒక క్లాష్ నెలకొంటుంది. ఈ హీరోకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఏ హీరో సినిమా హిట్ అవుతుంది? ఎవరి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అంటూ చాలానే అంచనాలు ఉంటాయి. అలాంటి ఒక బిగ్గెస్ట్ క్లాష్ ఇప్పుడు ప్రభాస్- షారుక్ ఖాన్ మధ్య నెలకొంది. నిజానికి ఇది వన్ సైడ్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ కి ముందే ప్రభాస్ మూవీ.. బాద్షా మూవీపై కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించింది. ఇప్పుడు డంకీ రిలీజ్ తర్వాత ఆ డామినేషన్ ఎక్కువైంది.

సలార్ సినిమాతో పోటీగా డంకీ సినిమా ఉండటంతో అందరూ మొదట ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభాస్ సినిమా బాలీవుడ్ లో షారుక్ సినిమా ముందు తేలిపోతుంది అన్నారు. అయితే అందుకు భిన్నంగా టికెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి సలార్ చిత్రం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే సలార్ సినిమాకి మాత్రం థియేటర్ల కేటాయింపులో మాత్రం అన్యాయం జరిగిందంటూ ఫ్యాన్స్ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. మల్టీప్రెక్స్ చైన్స్ లో సలార్ సినిమా రిలీజ్ కానివ్వకుండా షారుక్ ఖాన్ అడ్డుపడ్డాని అంతా భావిస్తున్నారు. డంకీ సినిమా కోసం షారుక్ తన పలకుబడి వాడి.. సలార్ మూవీకి స్క్రీన్స్ రాకుండా చేశాడని చెబుతున్నారు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ డంకీ సినిమా మీద గుర్రుగా ఉన్నారు.

fans Playing with Dunky!

ఇప్పుడు డంకీ సినిమా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బోర్లా పడిందనే చెప్పాలి. హిరానీ మార్క్ ఈ చిత్రంలో లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డంకీ ఫలితంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అయ్యింది. సలార్ సినిమాకి స్క్రీన్స్ రాకుండా చేశారనే అక్కసును ఇప్పుడు తీర్చుకుంటున్నారు. నెట్టింట ‘షారుక్స్ డిజాస్టర్ డంకీ’ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘డంకీ ఎగ్జిబిటర్స్ ఆన్ రోడ్’ అనే అంశం కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంక, ఈ టాక్ తో బాలీవుడ్ లో సలార్ కు రికార్డులు బ్రేక్ చేయడం మరింత ఈజీ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే కచ్చితంగా సలార్ రిలీజ్ తర్వాత చాలా స్క్రీన్స్ డంకీని తీసేసి సలార్ చిత్రాన్ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది.

ప్రభాస్ ఫ్యాన్స్ డంకీ సినిమాని ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా డంకీ సినిమాని డాంకీ పేరిట ట్రెండ్ చేశారు. తాజాగా ఈ స్టైల్ లో ఆడేసుకున్నారు. ఇదంతా చూసిన తర్వాత నెటిజన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తగులుకుంటే అలాగే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సలార్ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఇండియన్ సినిమాలో తొలిరోజు 30.25 లక్షలకు పైగా టికెట్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న డంకీ టాక్, సలార్ సినిమాకి ఉన్న హైప్ చూస్తే పాన్ ఇండియా లెవల్లో సలార్ సినిమా సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుందనే చెప్పాలి. మరి.. బాలీవుడ్ బాద్షా మీద ప్రభాస్ ఆధిపత్యం కొనసాగించండంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet