iDreamPost
android-app
ios-app

మరోసారి హ్యాండిచ్చిన వైజయంతి మూవీస్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్!

మరోసారి హ్యాండిచ్చిన వైజయంతి మూవీస్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్!

ప్రాజెక్ట్-K… ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ మూవీ గురించే పెద్దఎత్తున బజ్ నడుస్తోంది. శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలో జులై 20న ఫస్ట్ గ్లింప్స్.. రిలీజ్ డేట్ ని వెల్లడించనున్నారు. ఇండియన్ సినిమా నుంచి ఈ ఘనత సాధించనున్న తొలి చిత్రం ప్రాజెక్ట్- కే కావడం విశేషం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అమెరికా వ్యాప్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ రచ్చ రచ్చ చేస్తున్నారు. వారిలో జోష్ మరింత పెంచేందుకు ఒకరోజు ముందే వైజయంతీ మూవీస్ ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేసింది.

అయితే ఈసారి కూడా వైజయందీ మూవీస్ డార్లింగ్ ఫ్యాన్స్ కి హ్యాడ్ ఇచ్చింది. చెప్పిన సమయానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేకపోయింది. కాస్త టైమ్ పడుతుంది అంటూ మరో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. ఎందుకంటే ఈసారి రిలీజ్ టైమ్ లో సెకన్లు.. మిల్లీ సెక్లను కూడా పెట్టి ఇచ్చారు. అంత హడావుడి చేసి ఇలా నిరాశ పరుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ లో కూడా ఇలాగే చేశారు. టెక్నికల్ ఇష్యూ వచ్చింది అని కాసేపటిక తర్వాత రిలీజ్ చేశారు. తీరా చూస్తే అది ఎంతో సింపుల్ గా మన ఫోన్లో తీసుకునే పోట్రెయిట్ లా అనిపించింది. ఇందుకోసం మీరు ఇంత హంగామా చేశారా? అంటూ బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు.

మళ్లీ ఇప్పుడు ఇలా చేయడంతో ఆ కోపం కాస్తా రెట్టింపు అయ్యింది. ట్విట్టర్ వేదికగా తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. కొందరైతే వైజయంతీ మూవీస్ వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు కావాలనే ఇలా లేట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. హైప్ తీసుకొచ్చేందుకు ఇలా ఒక టైమ్ చెప్పి.. ఆ తర్వాత మళ్లీ లేట్ అవుతుందని చెప్పి తమ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్-K ఎంత గొప్ప ప్రాజెక్టో తమకు కూడా తెలుసని. కానీ, ఇలా పదే పదే తమని నిరాశ పరచొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా డార్లింగ్ మూవీకి హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు రావాలంటూ ఆకాంక్షిస్తున్నారు. బాహుబలితో బాలీవుడ్ ని దాటేశాం.. ఇప్పుడు మన గురి హాలీవుడ్ మీదే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ ని రీఫ్రెష్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet