కొన్నిసార్లు సినిమాలు సృష్టించే ప్రభావం.. దేశాలు దాటిపోతుంది. ఆయా దేశాలలో కూడా హీరోలకు ఫ్యాన్స్ తయారవుతుంటారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసేశాడు. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ నిరాశపరిచినా.. రీసెంట్ గా ఆదిపురుష్ తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా.. వందల కోట్లు కొల్లగొట్టే సత్తా ప్రభాస్ ఇమేజ్ కి మాత్రమే ఉందని ప్రూవ్ చేశాయి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు. అయితే.. ఇప్పుడు సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు రెడీ అవుతున్నాయి.
డార్లింగ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్.. ఇదివరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యంకాని రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. కేవలం నార్త్ అమెరికాలోనే సలార్ 1979కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంటే అర్ధం చేసుకోవచ్చు. సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు ఏ స్థాయిలో ప్లాన్ చేశారో. ఇక ఇండియాతో పాటు మిగతా దేశాల సంగతి చెప్పే అవసరం లేదు. అయితే.. సలార్ సినిమానే నెక్స్ట్ లెవెల్ లో రాబోతుందంటే.. దానికి మించిన క్రేజ్ తో వస్తోంది తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్.. సలార్ కి మించి క్రేజ్, హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే ప్రాజెక్ట్ కే టైటిల్, టీజర్ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జులై 20, 21 తేదీలలో ప్రాజెక్ట్ కే టైటిల్, టీజర్ అమెరికాలో, ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కాగా.. ప్రాజెక్ట్ కే కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ తో పాటు జపాన్ లో అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రాజెక్ట్ కే అప్డేట్స్ ని జపాన్ లో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా బాగా ఫాలో అవుతున్నారు. జపనీయులు తాజాగా ప్రాజెక్ట్ కే టిషర్ట్స్ ధరించి.. ప్రభాస్ కి, మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం. ప్రస్తుతం జపాన్ ఫ్యాన్స్ డార్లింగ్ కి విషెస్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే జపనిస్ ప్రభాస్ ని ఎంతలా ప్రేమిస్తున్నారో ఈజీగా అర్ధమవుతుంది. మరి ప్రాజెక్ట్ కే గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలపండి.
A lots of LOVE🥰❤️#JapanLovesPrabhas #WhatisProjectK #ProjectK #Prabhas #プラバース pic.twitter.com/tiG86BePmM
— プラバース日本ファンクラブ (@PrabhasJapanFC) July 18, 2023