iDreamPost
android-app
ios-app

Prabhas: వీడియో: ఆదిపురుష్ ఎఫెక్ట్.. బీర్ బాటిల్ తో చేయికోసుకున్న అభిమాని! ఇదేం పిచ్చిరా అయ్యా..

  • Author Soma Sekhar Published - 04:05 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 04:05 PM, Fri - 16 June 23
Prabhas: వీడియో: ఆదిపురుష్ ఎఫెక్ట్.. బీర్ బాటిల్ తో చేయికోసుకున్న అభిమాని! ఇదేం పిచ్చిరా అయ్యా..

తెలుగు ప్రజలకు ఉన్నంత సినిమా పిచ్చి మరే ఇతర ఇండస్ట్రీ ప్రజలకు లేదు అంటే అతిశయోక్తికాదు. అంతలా సినిమాలు అంటే ఇష్టపడతారు ఇక్కడి ప్రేక్షకులు. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. తమ అభిమాన స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు.. థియేటర్ల దగ్గర బాంబులు, బ్యాండ్ తో దద్దరిల్లిపోవాల్సిందే. ఇంత వరకు బాగానే ఉంటుంది కానీ.. ఈ అభిమానం మితిమీరితేనే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని బీర్ బాటిల్ తో తన చేయికోసుకుని ప్రభాస్ ఫొటోకి రక్తతిలకం దిద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఆదిపురుష్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా కలిసి నటించిన చిత్రం. తాజాగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటారో సర్వర్స్ క్రాష్ అవ్వడాన్ని బట్టే తెలిసింది. అయితే ఈ అభిమానం వరకు ఒకే గానీ అభిమానం హద్దు మీరితేనే నష్టాలు తప్పవు. తాజాగా ప్రభాస్ అభిమాని ఆదిపురుష్ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ దగ్గర.. బీర్ బటిల్ తో చేయి కోసుకుని ప్రభాస్ ఫొటోకు వీరతిలకం దిద్దాడు.

ఇక అక్కడ ఉన్న వారంత ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. వారు వద్దు వద్దు అంటూ మెుత్తుకుంటున్నా గానీ విన కుండా రెండు మూడు సార్లు బీర్ సీసాతో చేయి కోసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. అభిమానం ఉంటే తప్పు లేదు బ్రదర్.. కానీ ఇంత పిచ్చి ఉండకూడదు అని కొందరు అంటే.. మరికొందరేమో ఇంటి దగ్గర ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించు బ్రో అని రాసుకొచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ