Swetha
Raja Saab Movie Update: రెబెల్ స్టార్ బర్త్ డే సంధర్బంగా మొన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానికి జనాలు పిచ్చెక్కిపోయారు అనుకుంటే.. ఇక ఇప్పుడు సరిగ్గా బర్త్ డే రోజున మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మీడియా సోషల్ మీడియాను ఆక్రమించేసింది. ఈ మోషన్ పోస్టర్. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. అదేంటో చూసేద్దాం.
Raja Saab Movie Update: రెబెల్ స్టార్ బర్త్ డే సంధర్బంగా మొన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానికి జనాలు పిచ్చెక్కిపోయారు అనుకుంటే.. ఇక ఇప్పుడు సరిగ్గా బర్త్ డే రోజున మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మీడియా సోషల్ మీడియాను ఆక్రమించేసింది. ఈ మోషన్ పోస్టర్. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. అదేంటో చూసేద్దాం.
Swetha
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు తీయగానే.. ఇప్పుడు అంతా రాజాసాబ్ అనే అంటున్నారు. బర్త్ డే సంధర్బంగా ఫాన్స్ కు ట్రీట్ ఇస్తూ కాస్త ముందుగానే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. మరి మామూలుగా ఉందా ఆ పోస్టర్.. వేల కోట్ల కట్ అవుట్ అది. ప్రభాస్ అన్నట్లు నిజంగానే కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మి తీరాల్సిందే. ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. బర్త్ డే ట్రీట్ గా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభాస్ సినిమాలను రీరిలీజ్ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈసారి ప్రభాస్ బర్త్ డే గుర్తిండిపోయేలా బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ రీరిలీజ్ లు, రాజాసాబ్ నుంచి వచ్చిన పోస్టర్ తో పిచ్చెక్కిపోతున్నారంటే.. ఇంతలోనే రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
నిమిషాల్లో ఆ మోషన్ పోస్టర్ మీడియా , సోషల్ మీడియాను ఆక్రమించేసింది. అభిమానుల వాట్సాప్ స్టేటస్ లు , ఇంస్టా స్టోరీలుగా మారిపోయింది. అయితే ఈ మోషన్ పోస్టర్ తో సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు. అసలు ప్రభాస్ కెరీర్ లోనే ఇలాంటి కథ కనీ వినీ ఉండరు. పైగా పోస్టర్ ను హర్రర్ ఈజ్ న్యూ హ్యూమర్ అంటూ ఎండ్ చేశారు. గతంలో రాజాసాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని.. ఇదొక హర్రర్ మూవీ అని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్న మోషన్ పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ , పోస్టర్ లో ప్రభాస్ యంగ్ లుక్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ముసలి గెటప్ లో కనిపించాడు. దీనితో ప్రభాస్ ఈ మూవీలో తాత, మనవడు గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాత పాత్ర దెయ్యంగా.. మనవడి పాత్ర హీరో అని అర్ధమౌతుంది . ఆల్రెడీ ఇప్పటికే బిల్లా , బాహుబలి లాంటి సినిమాలలో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. కానీ ఇలా ఓల్డ్ గెటప్ లో కనిపించడం మాత్రం ప్రభాస్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్.
ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను 2025 ఏప్రిల్ కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఎంత చెప్పినా తక్కువే. బాక్స్ ఆఫీస్ రికార్డ్ లను కొల్లగొట్టాలన్నా, కోట్లు దానం చేయాలన్నా ప్రభాస్ తర్వాతే ఎవరైనా.. మనసున్న మహారాజు ప్రభాస్.. అంటూ ఇలా సోషల్ మీడియా అంతా కూడా ప్రభాస్ కట్ ఔట్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ప్రభాస్ లైన్ అప్స్ అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నుంచి వచ్చే అప్డేట్స్ కు.. ‘పోతారు హైప్ తో మొత్తం పోతారు’ అనే డైలాగ్ వాడడం ఒక్కటే తక్కువవుతుందేమో. ఇక ప్రభాస్ ప్రభంజనం ఎక్కడి వరకు కొనసాగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.