Nagendra Kumar
అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి.. టాలీవుడ్ హీరో ప్రభాస్ కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నారనే వార్తలు.. సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఆ వార్తలన్నీ అవాస్తవాలంటూ ఇప్పుడు మరొక వార్త వినిపిస్తోంది.
అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి.. టాలీవుడ్ హీరో ప్రభాస్ కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నారనే వార్తలు.. సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఆ వార్తలన్నీ అవాస్తవాలంటూ ఇప్పుడు మరొక వార్త వినిపిస్తోంది.
Nagendra Kumar
ప్రభాస్ అంటే ఈరోజున దేశం మొత్తం పీక కోసుకునేంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేసింది. బాహుబలి సినిమా నుంచి నిన్నమొన్న డిసెంబర్ 22న విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వరకూ ప్రభాస్ డిమాండ్, పాపులారిటీ పెరుగుతోంది తప్పితే.. రవ్వంత కూడా తగ్గటం లేదు. ఇటువంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న మరొక హీరో.. ఆసేతుహిమాచలం మరొకరు లేరంటే అసలు అతిశయోక్తి కానేకాదు. అందుకే ప్రభాస్ పేరుతో లింక్ అయిన ఏ వార్తకైనా, అది కరెక్టయినా కాకపోయినా, విపరీతమైన ప్రచారం అలవోకగా, అప్రయత్నంగా వచ్చెస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక వార్త భారీగా వైరల్ అవుతోంది.
అదేంటంటే జనవరి 22న జరుగుతున్న రామమందిరంలో.. రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ట పవిత్ర మహోత్సవానికి సంబంధించి.. ప్రభాస్ ని టాగ్ చేసేశారు సోషల్ మీడియా వీరులు. ఆ వార్త మీద లెక్కలేనన్ని పోస్ట్ లు, లైక్స్.. ఒకటి కాదు దేశం అంతా దీని మీదే వేడివాడి చర్చలు. ప్రభాస్ ని అభినందిస్తూ మెసేజెస్. మొత్తానికి ప్రభాస్ 50కోట్ల విరాళం దేనికయ్యా అంటే.. ప్రాణప్రతిష్ట మహోత్సం నాడు అక్కడికొచ్చే వారి భోజనాల నిమిత్తం.. జరగబోయే ఖర్చువెచ్చాలను ప్రభాస్ భరించడానికి ఒప్పుకున్నాడని, ఆ వ్యయప్రయాసలన్నీ మోయబోతున్నాడని.. ఇదీ కథ. ఎవరి స్వచ్ఛంద నినాదాలు వారివి. ఎవరి సొంత విశ్లేషణలు వారివి. ఇందులో నిజానిజాలు ఏమిటి, ఎంత వరకూ ఇది వాస్తవం అనే దానికన్నా.. ప్రభాస్ కి సంబంధించిన వార్తగా ఈ కంటెంట్ హెడ్ లైన్స్ లోకి వెళ్ళింది.
ప్రభాస్ కి ఈరోజున రాములవారి మహోత్సానికి 50కోట్లు ఖర్చుపెట్టడం ఏమంత భారం కాదు. కానీ అవునా కాదా అనే స్థాయిని దాటిపోయి అంచనాలు, ఊహాగానాలు అంబరాన్ని అంటుకున్నాయి. పైగా ఇది దాదాపు నమ్మశక్యంగానే అనిపించింది . ఎందుకంటే మొన్నీమధ్యనే ప్రభాస్ రాములవారి పాత్రను కూడా ఆదిపురుష్ చిత్రంలో ధరించడంతో.. ఈ వార్తకి లోతైన విశ్వసనీయత కలిగింది. ఇదే విషయం ప్రభాస్ టీంలో ముఖ్యమైన వ్యక్తిని.. ఐ డ్రీమ్ పోస్ట్ వెబ్ సైట్ ప్రతినిధి సంప్రదిస్తే ఆ వ్యక్తి పక్కా సమాచారం అందించారు. అటువంటిదేమీ లేదని, ప్రభాస్ కి అసలు ఈ విషయమే తెలియదని, దీనికి సంబంధించి ఎటువంటి వ్యవహారం నడవలేదని అయన వివరించారు. సో.. ప్రభాస్ 50కోట్లు విరాళమన్నది పూర్తిగా ఫేక్ అన్నది తెలిసింది.