iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! రెడీ అవుతున్న సినిమా రిలీజ్ వాయిదా..?

  • Author ajaykrishna Published - 05:01 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 05:01 PM, Mon - 10 July 23
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! రెడీ అవుతున్న సినిమా రిలీజ్ వాయిదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. చేతినిండా బిగ్గెస్ట్ మూవీస్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తను ఓకే చేసిన ఒక్కో సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే.. అభిమాన హీరో సినిమాలు రిలీజ్ కి దగ్గర పడుతుందంటే అభిమానులు చేసే హంగామా ఎలా ఉంటుందో తెలుసు కదా! మూవీ టీమ్ కంటే ఎక్కువగా ఫ్యాన్సే ఆ మూమెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ.. రిలీజ్ కి వస్తున్న సినిమా.. వాయిదా పడిందంటే మాత్రం ఫ్యాన్స్ లో కనిపించే నిరాశ కూడా చెప్పుకోలేని విధంగా ఉంటుంది. అయితే.. తాజాగా డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించి క్రేజీ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు గాని అయ్యిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇంతకీ.. ప్రభాస్ సినిమా ఏది వాయిదా పడింది? అనే వివరాల్లోకి వెళ్తే.. డార్లింగ్ నుండి ఈ ఏడాది ఆల్రెడీ ఆదిపురుష్ రిలీజ్ అయింది. అది విడుదలైన మూడు నెలలకు.. అంటే సెప్టెంబర్ లో సలార్ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా సలార్ గురించి ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. మోస్ట్ వయిలెంట్ యాక్షన్ తో రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్.. ప్రూవ్ చేసింది సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో! సలార్ తర్వాత ప్రభాస్ నుండి.. ప్రాజెక్ట్ కే రిలీజ్ కాబోతుంది. ఇది పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్, వైజయంతి ఫిలిమ్స్ కాంబినేషన్ లో మోస్ట్ ప్రెస్టిజియస్ మూవీగా ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇవే కాకుండా ప్రభాస్.. డైరెక్టర్ మారుతీతో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా లైనప్ చేశాడు. వీటిలో మారుతీ సినిమా ఆల్రెడీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మారుతీ మూవీ.. వచ్చే ఏడాది(2024) సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు వార్తలొచ్చాయి. కానీ.. ఇప్పుడా మూవీ రిలీజ్ సమ్మర్ నుండి చాలా వెనక్కి వెళ్లినట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో ప్రభాస్ – మారుతీ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలిందని చెప్పాలి. చూడాలి మూవీ రిలీజ్ కి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తారేమో! మరి ప్రస్తుతం డార్లింగ్ లైనప్ చేసిన మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio