iDreamPost
android-app
ios-app

Saalar: సలార్ ఆ రికార్డు కొడితే ప్రభాస్ నంబర్ వన్!

  • Published Dec 13, 2023 | 9:11 AM Updated Updated Dec 13, 2023 | 11:33 AM

ప్రస్తుతం సౌత్ లోనే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా సలార్. మరో 9 రోజుల్లో ఈ మూవీ విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. ఎందకంటే..

ప్రస్తుతం సౌత్ లోనే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా సలార్. మరో 9 రోజుల్లో ఈ మూవీ విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. ఎందకంటే..

  • Published Dec 13, 2023 | 9:11 AMUpdated Dec 13, 2023 | 11:33 AM
Saalar: సలార్ ఆ రికార్డు కొడితే ప్రభాస్ నంబర్ వన్!

బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆ మూవీ తర్వాత ఆయన చేసినవన్ని పాన్ ఇండియా సినిమాలే. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యాయి. సినిమా రిజల్ట్ తో పని లేకుండా.. ప్రభాస్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. కేజీఎఫ్ మూవీతో దేశాన్ని అల్లాడించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. అగ్ర నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సలార్ ‘సీజ్ ఫైర్’ డిసెంబర్ 22వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సలార్ సినిమా విడుదలకు కనీసం పది రోజుల సమయం కూడా లేదు. ఇప్పటి వరకు కేవలం ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభిస్తే.. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సలార్ మూవీకి సంబంధించి అలాంటివేం కనిపించడం లేదు. ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా లేదనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ మాత్రమే విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రమోషన్స్, ప్రీ రీలిజ్ ఈవెంట్ లేకుండా సినిమా విడుదల చేస్తే.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడుతుందని అంటున్నారు నిపుణులు.

అదే జరిగితే.. ప్రభాస్ ని మించిన స్టార్ లేడు..

ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సలార్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో..సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ సినిమా విజయాన్ని నిర్దేశిస్తాయి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. సలార్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ కనుక.. ట్రిపుల్ ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసినా, సమం చేసినా.. సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అని.. ప్రభాస్ క్రేజ్ మాత్రమే అందుకు కారణం అవుతుంది తప్ప.. ఇంకేమి కాదని అంటున్నారు నిపుణులు. అదే జరిగితే.. ఒపెనింగ్స్ లో ప్రభాస్ ని మించిన స్టార్ లేనట్టే అంటున్నారు. ఎందుకంటే.. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కోసం.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశ వ్యాప్తంగా తిరిగారు. ఎన్నో ఇంటర్వ్యూలు, ప్రీ రిలిజ్ కార్యక్రమాలు నిర్వహించి సినిమా మీద బజ్ ను క్రియేట్ చేశారు.

మరి సలార్ విషయానికి వస్తే.. ప్రమోషన్స్ లేవు.. ట్రైలర్ సైతం సినిమా స్టోరీ ఏంటో రివీల్ చేసింది. అసలు విడుదలకు ముందు సలార్ మీద బజ్ క్రియేట్ అయ్యేలా ప్రభాస్ కానీ, మూవీ టీమ్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జస్ట్ షూటింగ్ కంప్లింట్ చేసుకుని.. అలా నేరుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. వారి తీరు చూస్తే.. మిర్చి సినిమాలో చెప్పినట్లు.. హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకుని వచ్చి కొట్టేయొచ్చు అన్నంత ధీమాగా ఉన్నాడనిపిస్తుంది.

మరి అది స్టోరీ మీద నమ్మకమా లేక ప్రశాంత్ నీల్ ఇచ్చిన ధైర్యమా అర్థం కావడం లేదు కానీ.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం కూల్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి.. డీటీఎస్ మోత మోగించబోతున్నాడని అంటున్నారు అభిమానులు. మరి సలార్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది.. ప్రభాస్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకమే నిజమవుతుందా.. అనే విషయాలు తెలియాలంటే.. మరో 9 రోజులు వెయిట్ చేయాలి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet