iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్ తో ప్రభాస్ ప్రభంజనం.. ఇండియాలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరోగా..

  • Author Soma Sekhar Updated - 07:12 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Updated - 07:12 PM, Sat - 17 June 23
ఆదిపురుష్ తో ప్రభాస్ ప్రభంజనం.. ఇండియాలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరోగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. అప్పటి నుంచి వరుసగా పాన్ ఇండియా మూవీలనే చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. తాజాగా మైథలాజికల్ మూవీ అయిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. తొలి రోజు థియేటర్ల దగ్గర సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం దుమ్మురేపాయి. తొలి రోజే రూ. 100 కోట్లు పై చిలుకు వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ప్రభాస్.

ఆదిపురుష్.. టాక్ తో సంబంధం లేకుండా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 140 కోట్లను కొల్లగొట్టినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దాంతో ఓ అరుదైన రికార్డును ప్రభాస్ నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఈ రికార్డు సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. గతంలో బాహుబలి, సాహో సినిమాలు తొలి రోజే రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. తాజాగా ఆదిపురుష్ సైతం 100 కోట్ల రూపాయాలను కొల్లగొట్టింది. దాంతో మూడు సినిమాలతో ఈ మార్క్ ను అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మిగతా హీరోల్లో ఎవరు కూడా ప్రభాస్ రికార్డు దరిదాపుల్లో లేకపోవడం విశేషం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetfenomenbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio