iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఇంటి నుండి మరో హీరో.. కుర్రాడు మహేష్ బాబులా

బాక్సాఫీస్ షేక్ చేయాలన్నా, రికార్డులను సృష్టించాలన్నా, బాలీవుడ్ కొమ్ములను వంచాలన్నా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వల్లే సాధ్యం అనేంతగా మారిపోయాడు. కింగ్ ఆఫ్ టాలీవుడ్, డార్లింగ్ ప్రభాస్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తే వార్త ఒకటి బయటకు వచ్చింది.

బాక్సాఫీస్ షేక్ చేయాలన్నా, రికార్డులను సృష్టించాలన్నా, బాలీవుడ్ కొమ్ములను వంచాలన్నా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వల్లే సాధ్యం అనేంతగా మారిపోయాడు. కింగ్ ఆఫ్ టాలీవుడ్, డార్లింగ్ ప్రభాస్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తే వార్త ఒకటి బయటకు వచ్చింది.

ప్రభాస్ ఇంటి నుండి మరో హీరో.. కుర్రాడు మహేష్ బాబులా

తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్. బాహుబలితో టాలీవుడ్ గురించి దేశంలో ఉన్న ఇండస్ట్రీలే కాదూ.. హాలీవుడ్ సైతం చర్చించుకునేలా చేసింది. ఇక లోకల్ స్టార్ పాన్ ఇండియన్.. ఆపై గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. రెమ్యునరేషన్ విషయంలో బాలీవుడ్ హీరోలతో పోటీ పడటమే కాకుండా తన సినిమాలతో బీటౌన్ బాక్సాఫీసును శాసిస్తున్న హీరోగా అవతరించాడు. చాలా మంది టాలీవుడ్ హీరోలకు మార్గదర్శకుడయ్యాడు. ఇప్పుడు నాని, నిఖిల్ వంటి టైర్ 2 హీరోలు సైతం తమ సినిమాలను బాలీవుడ్‌లోకి రిలీజ్ చేసి కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి.

కాగా, ఈ యంగ్ రెబల్ స్టార్ ఫ్యామిలీ నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. డార్లింగ్ కజిన్స్ ఇండస్ట్రీలో నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ప్రభాస్ అన్నయ్య ప్రమోద్, కృష్ణం రాజు కుమార్తె ప్రగతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరో కజిన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడు. అతడి పేరు విరాట్ రాజు.  అతడు హీరోగా సినిమా ప్రారంభం కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి త్రివిక్రమ్, సుకుమార్, అనిల్ రావిపూడి అతిధులుగా విచ్చేసినట్లు సమాాచారం. అయితే వీరి మధ్య ఏ రిలేషనో క్లారిటీ లేదు. ప్రభాస్ ప్రోత్సాహంతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. గణేశ్ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. గౌడ్ సాబ్ అనే పేరు పెట్టారు. కుర్రాడు చూడటానికి తెల్లగా.. అచ్చం మహేష్ బాబులా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కల్కి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పోస్టు ప్రొడక్షన్ వర్క్ కూడా పేర్లర్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 9న రిలీజ్ చేయాల్సి ఉండగా.. మే 13న తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో కల్కి మూవీని పోస్టు పోన్ చేసినట్లు సమాచారం. మే 30న రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మారుతి మూవీ రాజా సాబ్, అలాగే సలార్-2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాలతో పాటు.. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో మరో ప్రాజెక్ట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. ఫౌజీ అన్న పేరు పరిశీలనలో ఉంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş