iDreamPost
android-app
ios-app

ప్రభాస్ బర్త్ డే పార్టీ.. ఓ రేంజ్ లో ఉంటుందట.. ఎక్కడో తెలుసా?

  • Author Soma Sekhar Published - 03:36 PM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 03:36 PM, Mon - 16 October 23
ప్రభాస్ బర్త్ డే పార్టీ.. ఓ రేంజ్ లో ఉంటుందట.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా తమ అభిమాన హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు.. అభిమానులు ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద కటౌట్లు కట్టి, పాలాభిషేకాలు చేస్తూ.. తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఇక మరికొన్ని రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఆ స్పెషల్ డే కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. మోకాలికి సర్జరీ చేయించుకుని, యూరప్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే ఉండటంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈసారి పుట్టినరోజు యూరప్ లోనే జరుపుకుంటున్నాడు రెబల్ స్టార్. అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేస్తున్నారట. సర్జరీ తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్.. తన బర్త్ డేను భారీ రేంజ్ లో జరుపుకోవడానికి యూరప్ లో ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం. ఇక బర్త్ డే కానుకగా కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రెడీ అవుతున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డేకి స్పెషల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు కావడంతో.. అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు కూడా అతడి బర్త్ డే కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తన పుట్టినరోజును యూరప్ లో జరుపుకోనున్నాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ మోకాలి సర్జరీ తర్వాత ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో తనకు సంబంధించిన ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులను ఇక్కడికే పిలుపించుకుని వారి సమక్షంలోనే బర్త్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడట రెబల్ స్టార్.

ఇక ఈ పుట్టినరోజు ఓ రేంజ్ లో ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులు త్వరలోనే యూరప్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీగా ఈ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక బర్త్ డే కానుకగా కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రెడీ అవుతున్నాయి. సలార్ నుంచి ఓ స్పెషల్ గ్లింప్ ప్రేక్షకుల కోసం సిద్దమవుతోంది. అలాగే కల్కి నుంచి కూడా ఓ అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్-మారుతి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఈ సందర్భాంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ చివరి వారంలో ప్రభాస్ ఇండియాకు తిరిగిరానున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş