Prabhas: హను రాఘవపూడి మూవీలో కొత్త పాత్రలో ప్రభాస్.. కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారాయన. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకున్నారు. గత నెలలో విడుదలైన ‘కల్కి’ ఏకంగా రూ.1,000 కోట్ల మార్క్​ను అందుకొని సంచలనం సృష్టించింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన ప్రభాస్ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘కల్కి’.. రిలీజైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అదే రేంజ్​లో హవా నడిపిస్తోంది. దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్న ప్రభాస్ ఇదే జోష్​లో పైప్​లైన్​లో ఉన్న మిగతా మూవీస్​ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

మారుతీ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’తో పాటు ప్రశాంత్ నీల్​తో ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమాలను ప్రభాస్ చేయాల్సి ఉంది. అలాగే మరో డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ఫిల్మ్​కు ఆయన కమిట్ అయ్యారు. దీంతో ఆయా చిత్రాల్లో రెబల్ స్టార్ క్యారెక్టర్స్​పై రోజుకో కొత్త విషయం వినిపిస్తోంది. ముఖ్యంగా హను రాఘవపూడి ప్రాజెక్ట్​పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఇందులో నెవర్ బిఫోర్​ అవతార్​లో ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. సైనికుడిగా ఆయన నటించనున్నారని ఫిలిం నగర్ టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్​ను అనుకుంటున్నారని సమాచారం.

లవ్ స్టోరీస్​ బేస్డ్ మూవీస్ తీయడంలో హను రాఘవపూడిది అందెవేసిన చేయి అనేది తెలిసిందే. ‘అందాల రాక్షసి’ నుంచి ‘సీతారామం’ వరకు హృద్యమైన ప్రేమ కథలతోనే ఆయన సినిమాలు తీసుకుంటూ వచ్చారు. మరోసారి అదే జోనర్​లో ఫిల్మ్ చేయబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో బార్డర్​లో సోల్జర్​గా కనిపించనున్నారట ప్రభాస్. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్​ను దాదాపుగా ఖాయం చేశారని సమాచారం. సైనికుడ్ని హిందీలో ఫౌజీ అంటారు. అందుకే కొత్తగా ఉంటుందని ఈ పేరుతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి గత చిత్రం ‘సీతారామం’లో హీరో దుల్కర్ సల్మాన్ కూడా సైనికుడిగానే కనిపించారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాంటి రోల్​లో నటించనున్నారట. ఇప్పటిదాకా ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్​లో యాక్ట్ చేసిన రెబల్​ స్టార్.. ఎప్పుడూ సైనికుడిగా కనిపించలేదు. మరి.. ప్రభాస్​ను సోల్జర్​గా చూడాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

Show comments