iDreamPost
android-app
ios-app

Prabhas: ‘స్పిరిట్’కి హీరోయిన్ ఫిక్స్? నాలుగోసారి డార్లింగ్ కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

  • Published Aug 05, 2024 | 3:05 PM Updated Updated Aug 05, 2024 | 3:05 PM

స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే డార్లింగ్ సరసన మూడు చిత్రాల్లో నటించింది. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ వివరాలు..

స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే డార్లింగ్ సరసన మూడు చిత్రాల్లో నటించింది. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ వివరాలు..

  • Published Aug 05, 2024 | 3:05 PMUpdated Aug 05, 2024 | 3:05 PM
Prabhas: ‘స్పిరిట్’కి హీరోయిన్ ఫిక్స్? నాలుగోసారి డార్లింగ్ కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్?

ఇండస్ట్రీలో హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలాగే హీరో-హీరోయిన్ కాంబోకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పలానా హీరోతో పలానా హీరోయిన్ నటిస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉంటారు. ఇక ఒకసారి హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి.. ప్రేక్షకులను ఫిదా చేస్తే.. మళ్లీ మళ్లీ ఆ జోడీని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటారు అభిమానులు. ఇక టాలీవుడ్ లో ఇలాంటి హిట్ కెమిస్ట్రీ కలిగిన జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి జోడీనే ముచ్చటగా మూడోసారి కాదు.. ఏకంగా నాలుగోసారి జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా నాలుగోసారి స్టార్ హీరోయిన్ నటించబోతోంది. ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ త్రిష ఈ మూవీలో నటిస్తే.. ఏకంగా నాలుగోసారి ప్రభాస్ కు జోడీగా నటించినట్లు అవుతుంది. ఇంతకు ముందు ఈ జంట వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించి.. తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి వెండితెరపై ఈ జోడీ కనువిందు చేయనుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas

కాగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించి ప్రాథమిక పనులు పూర్తి అయ్యాయని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో  చెప్పాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానునుంది. పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో డార్లింగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం మరుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తుండగా.. త్రిష ఇటీవలే ‘బృంద’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఇక చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. మరి ప్రభాస్ కు జోడీగా నాలుగోసారి త్రిష కనిపిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss