iDreamPost

Kalki 2898 AD: వైరల్ అవుతున్న కల్కి నటీ, నటుల రెమ్యూనరేషన్! ప్రభాస్ కు ఏకంగా అన్ని కోట్లా?

కల్కి మూవీ నటీ, నటుల రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తో సహా ఎవరెవరికి ఎన్నికోట్లు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి మూవీ నటీ, నటుల రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ తో సహా ఎవరెవరికి ఎన్నికోట్లు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

Kalki 2898 AD: వైరల్ అవుతున్న కల్కి నటీ, నటుల రెమ్యూనరేషన్! ప్రభాస్ కు ఏకంగా అన్ని కోట్లా?

‘కల్కి 2898 ఏడీ’.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటోంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా వరల్డ్  వైడ్ గా ఉన్న సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కల్కి మూవీ నటీ, నటుల రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ప్రభాస్ తో సహా ఎవరెవరికి ఎన్నికోట్లు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ కు ముందే.. రికార్డులను బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. మూవీ విడుదలకు ముందే.. ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసి.. దూసుకెళ్తున్నాడు ప్రభాస్. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కల్కి టీమ్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కల్కి చిత్రానికి ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారంటే?

కల్కి మూవీ బడ్జెట్ లో రెమ్యూనరేషన్ లకే ఎక్కువ భాగం ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక కీలక పాత్రల్లో మెరిసిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కు తలా రూ. 20 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కల్కి కోసం ఏకంగా రూ. 15 కోట్లు తీసుకున్నట్లు బీటౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా నటీ, నటులు.. టెక్నిషియన్లకు కలిపి దాదాపు రూ. 60 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం.

దీనిని బట్టి చూస్తే.. పారితోషికాలకే రూ. 250 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మాత్రమే. ప్రస్తుతం ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. విడుదల అయిన రెండు ట్రైలర్లు సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి కల్కి మూవీకి ప్రభాస్ ఇంత భారీ పారితోషికం అందుకోవడం, మిగతావారు కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి