iDreamPost
android-app
ios-app

‘కన్నప్ప’ కోసం ప్రభాస్.. మంచు విష్ణుకి డార్లింగ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

  • Author ajaykrishna Updated - 09:25 AM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 09:25 AM, Thu - 5 October 23
‘కన్నప్ప’ కోసం ప్రభాస్.. మంచు విష్ణుకి డార్లింగ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

ఇండస్ట్రీలో మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేవి హీరోలకు అరుదుగా లభిస్తుంటాయి. ప్రస్తుతం నడుస్తున్న కమర్షియల్ ట్రెండ్ లో దేవుళ్ళ క్యారెక్టర్స్ తో సినిమాలు చేయడం అంటే.. ఓ సవాల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఫలానా హీరో దేవుడి క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏ రేంజ్ లో అనలైజ్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లుక్ మొదలుకొని.. శరీర సౌష్ఠవం.. ప్రతీ విషయంలో ఫోకస్ పెడుతుంటారు. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి సంబంధించి ఒక్కో కటౌట్ మైండ్ లో ఉంటుంది. అదిగాక ఇన్నాళ్లు పెరుగుతూ.. దేవుళ్ళు ఇలా ఉండేవారని తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి.. ప్రేక్షకులకు దేవుళ్ళ క్యారెక్టర్ లుక్ పై ఓ ఇమేజినేషన్ ఉంటుంది.

అందులోనూ ఇన్ని సంవత్సరాలనుండి సినిమాలు, సీరియల్స్ లో కూడా చేస్తూ వస్తున్నారు. అందుకే.. రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా ఏ దేవుడి క్యారెక్టర్ తీసుకున్నా ఖచ్చితంగా కనిపించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఆ లెక్కన.. అన్ని దృష్టిలో పెట్టుకొని హీరోల క్యారెక్టర్స్ డిజైన్ చేస్తుంటారు మేకర్స్. అయితే.. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో శ్రీరాముడి క్యారెక్టర్ పోషించిన డార్లింగ్ ప్రభాస్.. త్వరలో మహాశివుడు క్యారెక్టర్ వేయనున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి క్యారెక్టర్ చేయనున్నట్లు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో మంచు విష్ణు, మోహన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక సినిమాలో ప్రభాస్ శివుడి క్యారెక్టర్ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార పార్వతిగా కనిపించనుందని టాక్ నడుస్తోంది. అయితే.. తాజాగా ప్రభాస్ శివుడి లుక్ కి సంబంధించి ఏఐ వెర్షన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దీంతో ఫ్యాన్స్ అందరికి ఏఐ వెర్షన్ శివుడి లుక్ బాగా నచ్చి.. మంచు విష్ణుకి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎలాగైనా ప్రభాస్ ని శివుడి లుక్ ని ఏఐ వెర్షన్ లుక్ లాగే చూపించాలని.. అలా చూపించడానికి కనీసం ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడో.. ఆయన మైండ్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉందో అని కొందరి వాదన. చూడాలి మరి కన్నప్పలో శివుడిగా ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss