vijaykanth:హాస్పిటల్ లో చేరిన ప్రముఖ నటుడు విజయ్‌కాంత్..!

తమిళ సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆనారోగ్యంతో కోలుకున్నా ఆయన గురించి మరో కీలక సమాచారం అందింది. ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు.

తమిళ సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆనారోగ్యంతో కోలుకున్నా ఆయన గురించి మరో కీలక సమాచారం అందింది. ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు.

తమిళ సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గురించి అందరికి తెలిసిందే. గతకొంత కాలంగా ఆయన తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మాయత్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అలాగే, లివర్ సమస్య కూడా ఉన్నది. జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇక డయాబెటిస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను తొలగించారు. దాదాపు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా, ఇటివలే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరినట్లు వార్త వినిపిస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇక విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో.. గతకొన్ని రోజుల నుంచి ఆయన మరణించారనే పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నీ నిజం కాదనీ, ఆయన ఆనారోగ్యం నుంచి కోలుకొని క్షేమంగా ఉన్నారని ఆయన భార్య ప్రేమలత సోషల్ మీడియా లో ఫోటోలను షేరు చేసింది. అయితే తాజాగా మరో మారు విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, రెగ్యులర్ చెకప్ కోసమే ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సమాచారం. అయితే విజయ్ కాంత్ ఇలా చాలా సార్లు ఆనారోగ్యం కి గురైయ్యారు. పలుమార్లు ఆయనకు సీరియస్ కూడా అయ్యింది. కానీ, ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇక గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయిన విజయ్ కాంత్ , నడవడానికి కూడా వీలు లేకపోవడంతో.. వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.

ప్రస్తుతం 70 ఏళ్ల విజయ్ కాంత్ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం పార్టీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా విజయ్ కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇక ఈయన పూర్తి పేరు విజయరాజ్ అలగర్ స్వామి ఈయన 1952 ఆగస్టు 25లో జన్మించారు. ఇక విజయ్ కాంత్ నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో స్టార్ హీరోగా మారారు. వందలాది తమిళ సినిమాల్లో హీరోగా నటించారు. కాగా , మళ్లీ ఆసుపత్రిలో చేరిన విజయ్ కాంత్ ఆరోగ్యం కుదిటపడి క్షేమంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.మరి, కెప్టెన్ విజయకాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments