iDreamPost
android-app
ios-app

నేను బతికే ఉన్నా.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే!

వివాదాస్పద నటి పూనమ్ పాండే మృతి వార్త అందరినీ కలిచి వేసింది. ఈ వార్తను జీర్ణించుకోలేక పోయారు అభిమానులు. ఈ న్యూస్ నిజం కాకుండా ఉంటే బాగుణ్ణు అని భావించారు. అనుకున్నట్లే ..

వివాదాస్పద నటి పూనమ్ పాండే మృతి వార్త అందరినీ కలిచి వేసింది. ఈ వార్తను జీర్ణించుకోలేక పోయారు అభిమానులు. ఈ న్యూస్ నిజం కాకుండా ఉంటే బాగుణ్ణు అని భావించారు. అనుకున్నట్లే ..

నేను బతికే ఉన్నా.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే!

నిన్నటి నుండి సోషల్ మీడియాను, బాలీవుడ్ సెలబ్రిటీలను, అభిమానులను జీర్ణించుకోలేకుండా చేసిన వార్త.. వివాదాస్పద నటి పూనమ్ పాండే మృతి చెందారన్న న్యూస్. సోషల్ మీడియాలో పూనమ్ ఇన్ స్టా ఖాతా నుండి ఈ న్యూస్ వచ్చింది. ఆమె సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)తో మృతి చెందినట్లు ఆ పోస్టు సారాంశం. పూనమ్ చనిపోయిందని వార్త రాగానే అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె సన్నిహితులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇది ఫేక్ అని తేలిపోయింది. ఆమె బత్రికే ఉంది. ఈ సందర్భంగా ఆమె వీడియోలను విడుదల  చేసింది. అనుకున్నట్లుగానే ఆమె గర్భాశయ క్యాన్సర్ ఎవర్ నైస్ క్యాంపెయిన్ కోసం ఇలాంటి ప్రయోగం చేసిందని తెలిపింది.

పూనమ్  రెండు వీడియోలతో సడెన్ ఎంట్రీ ఇచ్చింది.  తన ఇన్ స్టా ఖాతా ద్వారా వీడియోతో పాటు ఓ పోస్టు చేసింది ఈ కాంట్రవర్సీ క్వీన్.  ‘ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నా. నేను సజీవంగా బతికే ఉన్నా. గర్భాశయ క్యాన్సర్ బారిన నేను పడలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల ప్రాణాలు పోయాయి.  కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు.  హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్, ముందస్తుగా గుర్తించే పరీక్షల ద్వారా ఇది సాధ్యం.  ఈ వ్యాధితో ఏ మహిళ ప్రాణాలు కోల్పోకుండా జీవించగలిగే మార్గాలు ఉన్నాయి.  అవగాహనతో దీన్ని నివారిద్దాం. ఈ వ్యాధిని అంతం చేసేందుకు కృషి చేద్దాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ .

అలాగే వీడియోలో కూడా ఇదే విషయాన్ని తెలిపింది పూనమ్. కాగా, మరో వీడియోలో.. ‘హాయ్ ఎవ్రీవన్. ఇట్స్ పూనమ్. నా మరణ వార్తతో మిమ్మల్ని బాధపెట్టినందుకు సారీ. అయితే దేని కోసమైతే ఈ వార్త ప్రకటించామో.. అది సక్సెస్ అయినందుకు గర్వంగా ఉంది. అదే సర్వికల్ క్యాన్సర్. నా ఫేక్ మరణానికి కారణమైనది చెబుతున్న ఈ వ్యాధి గురించి మీకు తెలుసా.. ఈ వ్యాధి సైలెంట్ గా మహిళల్ని చంపేస్తుంది. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో చాలా మంది ఊహించినట్లుగానే ఆమె బత్రికే ఉంది. ఈ వార్తతో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ భామ.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

 

View this post on Instagram

 

A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి