iDreamPost
android-app
ios-app

గురువు పేరిట పూనమ్ కౌర్ సంచలన పోస్ట్.. అలాంటి వాడు గురువు కాదు..!

గురువు పేరిట పూనమ్ కౌర్ సంచలన పోస్ట్.. అలాంటి వాడు గురువు కాదు..!

తెలుగులో చాలా మంది హీరోయిన్స్ వెండితెరపై తళుక్కుమని తర్వాత కనిపించకుండా పోయారు. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా సైడ్ హీరోయిన్స్, ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించడం చూశాం. ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా వినిపించే పేరు పూనమ్ కౌర్. పెద్ద పెద్ద కళ్లు, అందం, అభినయం అన్నీ ఉన్నా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత చిన్నగా ఇండస్ట్రీ నుంచి కూడా కనుమరుగు అయ్యింది.

కానీ, సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ కౌర్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రమే కాకుండా.. సమాజానికి సంబంధించిన ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్స్ ర్ గా కూడా ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఎవరి గురించి చెప్పింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.

Poonam kaur comments

గురు పౌర్ణమి సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పూనమ్ పోస్ట్ చేసిన స్టోరీ ఈ విధంగా ఉంది. “మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. టామ్, డిక్ అండ్ హ్యారీ అని ప్రతి ఒక్కరిని గురువు అని పిలవద్దు. స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు మాత్రమే గురువు అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, గుండెచప్పుడు కావచ్చు, మీకు విముక్తి కూడా కావచ్చు ” అంటూ పూనమ్ కౌర్ రాసుకొచ్చింది. ఇటీవలి కాలంలో నాతి చరామీ సినిమాతో తళుక్కుమంది. మళ్లీ సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈ పోస్టు సాధారణంగా పెట్టిందా? ఎవరిని అయినా టార్గెట్ చేస్తూ పెట్టిందా? అనే అంశంపై మాత్రమే క్లారిటీ రాలేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom