iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు చెట్ల పొదల్లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు?..

  • Published Apr 21, 2024 | 11:15 AM Updated Updated Apr 21, 2024 | 11:15 AM

ఒకప్పుడు చెట్ల పొదల్లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్ల పరువు కాపాడారు. ఈరోజు హీరోయిన్లు వాడుతున్న వ్యానిటీ వ్యాన్ లను ఆమె ఎప్పుడో వాడారు. వాటిని సెలబ్రిటీలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఒకప్పుడు చెట్ల పొదల్లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్ల పరువు కాపాడారు. ఈరోజు హీరోయిన్లు వాడుతున్న వ్యానిటీ వ్యాన్ లను ఆమె ఎప్పుడో వాడారు. వాటిని సెలబ్రిటీలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

  • Published Apr 21, 2024 | 11:15 AMUpdated Apr 21, 2024 | 11:15 AM
ఒకప్పుడు చెట్ల పొదల్లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు?..

ఇప్పుడంటే వ్యానిటీ వ్యాన్ లు, కారవాన్ లు వచ్చాయి కానీ సినీ పరిశ్రమ మొదలైన తొలినాళ్లలో ఇవేమీ ఉండేవి కావు. హీరోలైనా, హీరోయిన్లైనా విశ్రాంతి తీసుకోవాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా, వాష్ రూమ్ కి పోవాలన్నా ఇప్పుడు వ్యానిటీ వ్యాన్ లు ఉంటున్నాయి. మరి అప్పట్లో అంటే చెట్ల పొదలే వాష్ రూములు, రెస్ట్ రూములు, బట్టలు మార్చుకునే రూములు. పొదలు లేకపోతే బస్సు వెనకాల బట్టలు మార్చుకోవడం, మూత్ర విసర్జన చేయడం చేసేవారట. లేదంటే హోటల్ కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. మాధురి దీక్షిత్, శ్రీదేవి, జయా బచ్చన్ ఇలా చాలా మంది హీరోయిన్లు అప్పట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోయిన్ గా తోటి హీరోయిన్లు పడే ఇబ్బందులు చూసి ఏదైనా చేయాలనుకున్నారు ఆమె.

అప్పుడే ఆమె వ్యానిటీ వ్యాన్ కాన్సెప్ట్ గురించి ఆలోచించారు. బస్సుని వ్యానిటీ వ్యాన్ గా మారిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఆమె.. దాని కోసం బస్సులోనే ఏసీ పెట్టించి.. టాయిలెట్ ఏర్పాటు చేయించారు.  అలానే ఒక మేకప్ రూమ్ కూడా ఏర్పాటు చేయించారు. 1991లో జె.కె. ట్రావెలర్స్ సహకారంతో ఈ వ్యానిటీ వ్యాన్ కాన్సెప్ట్ ని అమలు చేశారు. భారతదేశంలో వ్యానిటీ వ్యాన్ కలిగిన తొలి హీరోయిన్ కూడా ఈమెనే. ఈమెకు విదేశాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ వ్యానిటీ వ్యాన్ కాన్సెప్ట్ గురించి ఆలోచన వచ్చిందట. అక్కడ హీరోయిన్లు వ్యాన్ లో బట్టలు మార్చుకోవడం, మేకప్ వేసుకోవడం చేస్తుంటారు. ఆ వ్యాన్ ని ట్రైలర్ వ్యాన్ అని, మేకప్ వ్యాన్ అని పిలుస్తారు.

అప్పుడే ఆమెకు ఎలాగైనా ఈ వ్యాన్ కాన్సెప్ట్ ని మన దేశంలో అమలు చేయాలన్న ఆలోచన వచ్చిందట. ఆమె ఇక్కడ 25 వ్యానిటీ వ్యాన్ లను ప్రారంభించారు. అయితే వ్యానిటీ వ్యాన్ ని మెయింటెయిన్ చేయడం అంటే వేస్ట్ ఖర్చు అని అనుకున్నారు. కానీ కాలక్రమేణా దాని అవసరం ఏంటో తెలుసొచ్చింది. దీంతో ఆమె వ్యానిటీ వ్యాన్ ల వ్యాపారానికి డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత హీరోలు, హీరోయిన్లు వ్యానిటీ వ్యాన్ లను కొనడం ప్రారంభించారు. ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు అందరి దగ్గర ఓ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఉండడం కామన్ అయిపోయింది. ఇలా ఆమె ఎంతోమంది సెలబ్రిటీల పరువుని కాపాడిన వ్యక్తిగా నిలిచారు. ఆమె పేరు పూనమ్ ధిల్లాన్.

ఆమె 16 ఏళ్ల వయసప్పుడే మిస్ ఇండియా అయ్యారు. బాలీవుడ్ లో త్రిశూల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఆమె.. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె వ్యానిటీ వ్యాన్ వ్యాపారం నడుపుతూనే అడపాదడపా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. మరి బట్టలు మార్చుకోవడానికి, టాయిలెట్ కి ఇబ్బంది పడుతున్న హీరోయిన్స్ ని చూసి మహిళ అయి ఉండి బస్సుని వ్యానిటీ వ్యాన్ గా మార్చాలని ఆలోచించి ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయిన విధానంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by PoonamDhillon (@poonam_dhillon_)