iDreamPost
android-app
ios-app

సినీ క్రిటిక్ కి హీరోయిన్ పూజా హెగ్డే నోటీసులు! అసలేం జరిగింది?

  • Author ajaykrishna Published - 04:02 PM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 04:02 PM, Wed - 26 July 23
సినీ క్రిటిక్ కి హీరోయిన్ పూజా హెగ్డే నోటీసులు! అసలేం జరిగింది?

సినీ ప్రేక్షకులకు హీరోలు, హీరోయిన్స్, మూవీ టీమ్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు క్రిటిక్స్ కూడా పరిచయం అవుతుంటారు. ఆయా క్రిటిక్స్ సినిమా నాలెడ్జి, వాళ్ల రివ్యూస్ బట్టి.. కొన్నిసార్లు ఫ్యాన్స్ కూడా పుట్టుకొస్తుంటారు. అదేవిధంగా విమర్శించే వారు ఉంటారు. అయితే.. ఇండియన్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్నటువంటి పాపులర్ క్రిటిక్స్ లో ఉమైర్ సంధు ఒకరు. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడినంటూ ట్విట్టర్ లో సినిమా రివ్యూలు పోస్ట్ చేస్తుంటాడు. అదికూడా సినిమా రిలీజ్ కి కొద్దిరోజుల ముందే ఇతను రివ్యూస్ ఇవ్వడం అందరూ షాకయ్యే విషయం. ముందు ఉమైర్ చెప్పే రివ్యూస్ నమ్మడం కంటే.. అతన్ని ట్రోల్స్ చేయడమే ఎక్కువగా జరుగుతుంటుంది.

క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధుకి ఇండియా నుండే కాదు. దేశవిదేశాల నుండి శత్రువులు ఏర్పరచుకున్నాడు. అయితే.. ఇతన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ.. మరింత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం రివ్యూస్ మాత్రమే కాదు. కొన్నిసార్లు రివ్యూస్ ఇవ్వడం పక్కన పెట్టేసి.. ఎవరో హీరో, హీరోయిన్స్ పై తప్పుడుగా వాగడమే. తగ్గరుండి చూసినట్లుగా.. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి అఫైర్స్ పెట్టేస్తుంటాడు. ప్రతిసారి ఓ సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ.. ఉమైర్ వాళ్ల పర్సనల్ లైఫ్ ని కూడా కదిలించే ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్లకు సంబంధించిన విషయాలపై తనకు హక్కు ఉన్నట్లుగా పోస్టులు పెట్టేస్తుంటాడు ఉమైర్. అయితే.. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఉమైర్ కి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

అసలు వివరాల్లోకి వెళ్తే.. పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ప్లాప్ లలో మునిగిపోయింది. చేతిలో తెలుగు సినిమాలు ఒక్కటీ లేవు. దీంతో పూజా కొన్ని రోజులుగా డిప్రెషన్ కి లోనవుతుందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని.. ఆమె ఫ్యామిలీనే చివరికి కాపాడింది’ అంటూ ఉమైర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో పూజా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఉమైర్ ని ఓ ఆటాడుకుంటున్నారు. వేరే పనిపాట ఏం లేదా.. ఇలా లేనిపోనివి ప్రచారం చేస్తూ గడిపేస్తున్నవు అని నెటిజన్స్ అడుగుతున్నారు. ఈ క్రమంలో ఉమైర్ సంధు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడని పూజా అతనికి లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే.. పూజా పంపిన నోటీసులను సైతం ఉమైర్ తన ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం. మరి పూజా ఉమైర్ ల ఇష్యూ ఏం కానుందో చూడాలి. మరి పూజా హెగ్డే గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom