iDreamPost
android-app
ios-app

pooja hegde పూజా హెగ్డే రివర్స్ గేర్

  • Published Apr 30, 2022 | 12:04 PM Updated Updated Apr 30, 2022 | 12:04 PM
pooja hegde పూజా హెగ్డే రివర్స్ గేర్

టైం అంతే. ఒక్కోసారి ఆకాశానికి ఎంత వేగంగా తీసుకెళ్తుందో అంతకన్నా ఫాస్ట్ గా ధభీమని కిందకు పడేస్తుంది. అది సినిమా ఇండస్ట్రీకి బాగా వర్తిస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వరసగా ఫ్లాపులు పడితే ఎవరికైనా ఇబ్బందే. అందులోనూ పూజా హెగ్డే లాంటి హీరోయిన్ కైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డెబ్యూ మూవీ ముకుందతో మొదలుపెడితే కొన్నేళ్లు ఐరన్ లెగ్ అనిపించుకున్న పూజా ఆ తర్వాత డిజె ఇండస్ట్రీ హిట్ కాకపోయినా తనకు మాత్రం గొప్ప బ్రేక్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి సూపర్ సక్సెస్ లతో గ్రాఫ్ అమాంతం పైకి ఎగబాకింది. స్పెషల్ సాంగ్ కే కోటి తీసుకునే రేంజ్ కి వెళ్లిపోయింది.

ఇక అల వైకుంఠపురములో గురించి చెప్పాలంటే అదో చరిత్ర. జస్ట్ పర్వాలేదనిపించే కంటెంట్ ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాస్ కావడంలో పూజా రోల్ ఉందని అభిమానులు చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడంతా రివర్స్ అవుతోంది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన రాధే శ్యామ్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తన పెర్ఫార్మన్స్ మీద కామెంట్స్ వచ్చాయి. అంత ఇంటెన్స్ లవ్ స్టోరీలో ఫిట్ కాలేదనే అభిప్రాయాలు వచ్చాయి. విజయ్ తో బీస్ట్ లో ఆడిపాడితే అది కూడా డిజాస్టర్ రూటు పట్టింది. తమిళంలో విజయ్ ఇమేజ్ వల్ల నష్టాలు తగ్గాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే కెజిఎఫ్ చాప్టర్ 2 దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.

ఇప్పుడు ఆచార్య వంతు. నిన్న రిలీజైన ఈ మెగా మూవీ ఫలితం ఏంటో కళ్లారా చూస్తున్నాం. అందులో రామ్ చరణ్ కు జోడిగా నటించిన పూజా హెగ్డే తనది మొక్కుబడి పాత్రే అయినా ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొంది. తీరా చూస్తే ఇదీ ఫ్లాపు. మొత్తం హ్యాట్రిక్ పూర్తయ్యింది. ఇప్పుడు తన చేతిలో ఉన్న పెద్ద సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ ప్రాజెక్టు. బాలీవుడ్ లో చేసిన సర్కస్ ఇంకా విడుదల కాలేదు. ఎఫ్3 ప్రత్యేక గీతంలో నర్తించింది. వీటిలో ఏదో ఒకటి పెద్ద బ్రేక్ ఇవ్వాలి. అయినా కంటెంట్ లో లోపాలు పెట్టుకుని పూజాని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కానీ పరిశ్రమలో సెంటిమెంట్ల లెక్కల గురించి తెలిసిందేగా