Krishna Kowshik
పొలిమేర సిరిస్ మూవీలతో ఆకట్టుకున్న నటి కామాక్షి భాస్కర్ల. ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి సినిమాలతో పాటు సైతాన్, దూత వెబ్ సిరీసుల్లో నటించింది. మిస్ ఇండియా పోటీలకు వెళ్లిందీ ఈ డాక్టరమ్మ. అయితే
పొలిమేర సిరిస్ మూవీలతో ఆకట్టుకున్న నటి కామాక్షి భాస్కర్ల. ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి సినిమాలతో పాటు సైతాన్, దూత వెబ్ సిరీసుల్లో నటించింది. మిస్ ఇండియా పోటీలకు వెళ్లిందీ ఈ డాక్టరమ్మ. అయితే
Krishna Kowshik
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు చాలా మంది నటీమణులు. కానీ ఈ అమ్మాయి కాస్త డిఫరెంట్.. డాక్టర్ అయ్యాక యాక్టర్ అయ్యింది. వైద్య వృత్తిని కాదని ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆమె చీర కట్టుతో.. అండర్ రేటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదూ పొలిమేర బ్యూటి కామాక్షి భాస్కర్ల. మా ఊరి పొలిమేర, పొలిమేర 2లో ఆమె నటనకు ఫిదా కాని వారు లేదు. చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాక.. అపోలో ఆసుపత్రిలో కొంత కాలం డాక్టరుగా పనిచేసింది. ఆ వృత్తిని వదిలి 2018లో మిస్ ఇండియా పోటీలకు సిద్దమైంది. ఆ ఏడాది మిస్ తెలంగాణాగా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనల్స్‌కు వరకు వెళ్లింది.
కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఇంటస్ట్రింగ్ వ్యాఖ్యలు చేసింది. తనకు చిన్నప్పటి నుండి నటించాలన్న ఆసక్తి ఉందని, అలాగే సర్వీస్ చేయాలని కలలు కన్నానని, అయితే తాను చెబితే 10 మంది మాట వినాలన్న ఉద్దేశం ఉండేదని, తనకు గుర్తింపు ఉన్నప్పుడే ఇది సాధ్యమని భావించి.. ఈ రంగాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు. ‘ ఓ సైంటిస్ట్ గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ చిరంజీవి గారి ఫస్ట్ ఫిల్మ్, 150 సినిమా ఏంటీ అని అడిగితే చెబుతున్నారు. అయితే ఎవరినీ ఎక్కువ చేయాలని, తక్కువ చేయాలని కాదు కానీ.. ఇది వాస్తవం’ అని తెలిపారు. తను ఇంట్రోవర్ట్ అని, ఎక్కువగా పెట్స్, బుక్స్‌తో ఎక్కువ గడుపుతానని అన్నారు. ఇండస్ట్రీలోకి వస్తానంటే తన ఫ్రెండ్ ఇమడలేనని, అందరితో మాట్లాడలేవు, అది వేరోలా ప్రొజెక్ట్ అవుతుందని అన్నారు.
‘2018లో మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేద్దామని ఇండియాకు తిరిగి వచ్చాను. 150 అమ్మాయిల్లో నేను ఒకరు. నేను పార్టిసిపేంట్ ఆ ఏడాదిలోనే ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, సిద్ది ఇద్ద్నానీ పాల్గొన్న వాళ్లు సెలక్ట్ కాలేదు. నేను సెలెక్ట్ అయ్యాను. మిస్ ఇండియా తెలంగాణగా పాల్గొన్నాను’ అని చెప్పారు. ఇందులో పాల్గొనడం కోసం యూట్యూబ్‌లో ఐశ్వర్యరాయ్, లారా దత్తా వీడియోలు చూశానన్నారు. మిస్ ఇండియా తెలంగాణలో టైటిల్ గెలిచాక.. ఓ కంటెస్టెంట్/జడ్జి పిలిచి ‘ నువ్వు 62 కేజీలు ఉన్నావ్. నువ్వు 50 కేజీలకు తగ్గాలి’ అంటూ చెప్పింది. అయితే తనకు ఎంబీబీఎస్ చదివాక.. ఇటు వస్తాను అనే సరికి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వనున్నారు. ఇవ్వొద్దని చెప్పాను.. తనే సంపాదించుకుంటానని చెప్పానన్నారు.
మిస్ ఇండియా ప్రిపరేషన్ కోసం చాలా కష్టపడ్డానని అన్నారు. ‘మిస్ ఇండియా పోటీలో పాల్గొనడానికి 57 కేజీలకు తగ్గా. కానీ ఈ ప్రాసెస్‌లో చాలా ప్రశ్నలు వచ్చాయి. సుస్మితా సేన్, లారా దత్తా మాట్లాడితే మిగిలిన అమ్మాయిలకు ప్రేరణగా ఉండేది. కానీ బ్యూటీ కంటెస్టులో పళ్లు ఒకే వరుసలో ఉండాలి, ముఖానికి బొటాక్స్ చేయించుకుంటారు. వెయిట్ తగ్గాలి. స్ట్రెచ్ మార్క్ ఉండకూడదు. ఇవన్నీ చూసి అన్ రియలిస్టిక్ అనిపించింది. బ్యూటీ ఫ్యాషన్ అనేది మహిళలన్ని ఎంపవర్ చేయడానికి.. కానీ మనల్ని మనమే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం నాకు నచ్చలేదు. టాప్ 15 వరకు వెళ్లాను. అయితే ఈ టైటిల్ గెలవకపోతే.. మీరు ఏం చేస్తారు అని జడ్జి అడిగిన ప్రశ్నకు..వారి తగ్గ ఆన్సర్ ఇవ్వలేకపోయాను’ అని చెప్పింది. మిస్ ఇండియా పోటీల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఎవడో ఒకడు ఉంటాడు.. ఆశపడతాడు.. కామం,మోహం, అన్నీ ఉంటాయి’ అని చెప్పారు. అలాగే ఇదంతా ఓ మాఫియా అని పేర్కొన్నారు.