P Krishna
Polimera 2 Movie Achieved a Rare Feat: 2011లో వచ్చిన మా ఊరి పొలిమేర మంచి విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం థియేటర్లో, ఓటీటీలో దుమ్మురేపింది.
Polimera 2 Movie Achieved a Rare Feat: 2011లో వచ్చిన మా ఊరి పొలిమేర మంచి విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం థియేటర్లో, ఓటీటీలో దుమ్మురేపింది.
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. కలెక్షన్ల పంట పండిస్తున్నాయి. టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పాత్రల్లో నటిస్తూ తర్వాత స్టార్ కమెడియన్ గా మారిన సత్యం రాజేష్ ఇటీవల నటించిన ‘మా ఊరి పొలిమేర2’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయిన ‘మా ఊరి పొలిమేర’ మూవీకి సీక్వెల్. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ అద్భుతమైన విజయం సాధించింది. చేతబడి, భాణామతి, క్షుద్ర పూజల కాన్సెప్ట్ తో తెరకెక్కించి ఈ మూవీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.. దీంతో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా మా ఊరి పొలిమేర 2 మరో అరుదైన ఘనత సాధించింది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో హర్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. మా ఊరి పొలిమేర, మసుధ, విరూపాక్ష, పిండం ఇలా హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు మంచి హిట్ అవుతున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢ నమ్మకాలపై ప్రజలు విశ్వాసం చూపిస్తుంటారు. చేతబడి, బాణామతి రక రకాల క్షుద్ర పూజలు చేసి మనిషిని హింసించి ఎలా చంపుతారు అన్న కాన్సెప్ట్ తో పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ‘మా ఊరి పొలిమేర’ మూవీ మంచి విజయం సాధించిన తర్వాత దర్శకుడు అనీల్ విశ్వనాథ్ ఈ మూవీకి సీక్వెల్ గా ‘పొలిమేర 2’ తెరకెక్కించాడు. ఈ చిత్రం శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌర్ కృష్ణ నిర్మించారు. గ్యానీ సంగీతం అందించారు.
పొలిమేర మూవీలో నటించిన ప్రధాన పాత్రలే ‘పొలిమేర 2’ లో కనిపిస్తాయి. చేతబడి, క్షద్రపూజల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి. పొలిమేర మూవీ గత ఏడాది నవంబర్ 3న ధియేటర్లలో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. ఏప్రిల్ 30, 2024న న్యూ ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14వ దాదా సాహెబ్ ఫాల్కె ఫిలిమ్స్ ఫెస్టివల్ లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవి వర్మ నటించారు.